పవన్‌ కళ్యాణ్‌ రీఎంట్రీ ఇస్తూ `వకీల్‌సాబ్‌`లో నటిస్తున్న విషయం తెలిసిందే. వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా బాలీవుడ్‌ హిట్‌ `పింక్‌`కి రీమేక్‌. ఈ సినిమాలో పవన్‌ సరసన శృతి హాసన్‌ కనిపించనుంది. అలాగే అంజలి, నివేదా థామస్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

బోనీ కపూర్‌ సమర్పణలో దిల్‌రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. కరోనా వల్ల ఆగిపోయిన ఈ చిత్ర షూటింగ్‌ ప్రారంభమవడానికి ఇంకాస్త టైమ్‌ పట్టే ఛాన్స్ ఉంది. ఇదిలా ఉంటే ఈ సినిమా విడుదల విషయంలో సస్పెన్స్ నెలకొన్న నేపథ్యంలో తాజాగా దిల్‌రాజు ఓ నిర్ణయానికి వచ్చారు. ఈ సినిమా ఓటీటీలో విడుదల కాబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. 

అమేజాన్‌ ప్రైమ్‌ వారు `వకీల్‌ సాబ్‌`ని ఓటీటీలో విడుదల చేయడానికి భారీ ఆఫర్‌ చేశారట. దాదాపు ఎనభై కోట్లు ఆఫర్‌ చేశారని టాక్‌. కానీ ఈ చిత్రాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ థియేటర్‌లోనే విడుదల చేయాలని దిల్‌రాజు నిర్ణయించుకున్నారట. థియేటర్‌లో విడుదల చేయడం వల్ల జనాలను థియేటర్‌కి తీసుకురావడమే కాదు, తనకు కమర్షియల్‌గానూ హెల్ప్ అవుతుందని ఆయన భావిస్తున్నారట. అందుకే ఈ భారీ ఆఫర్‌ని కూడా తిరస్కరించినట్టు టాక్‌. ఇదిలా ఉంటే ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదలకు ప్లాన్‌ చేస్తున్నారు దిల్‌రాజు.