#DilRaju: గెస్ట్ రోల్ లో దిల్ రాజు,మళ్లీ హిట్ కొడతారా

ప్యాన్ ఇండియా రేంజ్‌లో మెప్పిస్తున్న అంజ‌లి న‌టిస్తున్న 50వ సినిమా ఇది.  గీతాంజలి సినిమాలో నటించిన వాళ్లంతా ఈ సీక్వెల్ లో కూడా నటించారు. కోన వెంకట్ రచన, నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది. 

Dil Raju will give Guest appearance in Horror Comedy Sequel Movie jsp


 నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా ఫుల్ బిజీ దిల్ రాజు. అయితే ఆయన తెరపై కనిపించే సందర్బాలు అరుదు. తెరవెనకే మల్టీఫుల్ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉంటారు. అయితే దిల్ రాజు ఓ హారర్ కామెడీ చిత్రంలో గెస్ట్ గా చేసారు. ఇప్పుడు కూడా ఆ చిత్రం సీక్వెల్ లో సెంటిమెంట్ గా మరోసారి గెస్ట్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఆ సినిమా మరేదో కాదు... ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’.

అంజలి నటించిన హారర్ కామెడీ సినిమా ‘గీతాంజలి’.దిల్ రాజు ఈ సినిమాలో గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చారు. ఇప్పుడు మరోసారి దిల్ రాజు వెండితెరపై కనపడబోతున్నారు.  ఓ సీన్ లో మాత్రమే ఆయన కనిపిస్తారు. దర్శక,నిర్మాతలు ..సెంటిమెంట్ అని చెప్పడంతో కాదనలేక చేసినట్లు సమాచారం.   ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేష‌న్‌ సంస్థలు ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నాయి. అచ్చ తెలుగు అమ్మాయి అయినా ప్యాన్ ఇండియా రేంజ్‌లో మెప్పిస్తున్న అంజ‌లి న‌టిస్తున్న 50వ సినిమా ఇది.  గీతాంజలి సినిమాలో నటించిన వాళ్లంతా ఈ సీక్వెల్ లో కూడా నటించారు. కోన వెంకట్ రచన, నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది. 

ఇటీవలే టీజర్ రిలీజ్ చేయగా ఆద్యంతం భయపెడుతూ నవ్వించింది. ఈ సినిమా మార్చ్ 22న రిలీజ్ కాబోతుంది.   నిన్నుకోరి, నిశ్శబ్దం వంటి చిత్రాలకు కొరియోగ్రఫీ చేసిన అమెరికాలోని అట్లాంటాకు చెందిన కొరియోగరాఫర్ శివ తుర్లపాటి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతుండటం విశేషం.`గీతాంజ‌లి మ‌ళ్లీ వ‌చ్చింది` చిత్రంలో అంజ‌లి, శ్రీనివాస‌రెడ్డి, స‌త్యం రాజేష్‌, స‌త్య‌, ష‌క‌ల‌క శంక‌ర్‌, అలీ, బ్ర‌హ్మాజీ, ర‌వి శంక‌ర్ (డ‌బ్బింగ్ ఆర్టిస్ట్), రాహుల్ మాధ‌వ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.  ఈ సినిమాకు క‌థ‌: కోన వెంక‌ట్‌, స్క్రీన్ ప్లే: కోన వెంక‌ట్‌, భాను భోగ‌వ‌ర‌పు, మాట‌లు: భాను భోగ‌వ‌ర‌పు, నందు శ‌వ‌రిగ‌ణ‌, ద‌ర్శ‌క‌త్వం: శివ తుర్ల‌పాటి, సంగీతం: ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు, కెమెరా: సుజాత సిద్ధార్థ్, ఎడిట‌ర్‌: చోటా కె ప్ర‌సాద్‌, ఆర్ట్: నార్ని శ్రీనివాస్‌, ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌: నాగు వై, పీ ఆర్ ఓ: వంశీ కాక‌, ప‌బ్లిసిటీ డిజైన‌ర్‌: అనిల్ భాను

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios