సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం 'మహర్షి' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకి ముగ్గురు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. వారిలో దిల్ రాజు ఒకరు. అయితే ఈ సినిమాతో మహేష్ ని వదలడానికి ఇష్టపడడం లేదు దిల్ రాజు.

మహేష్ తదుపరి సినిమా కూడా తన బ్యానర్ పై నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నాడు. దర్శకుడు సుకుమార్ పూర్తి కథ సిద్ధం చేయడానికి మరికొంత సమయం పడుతుందని ఈ గ్యాప్ లో దర్శకుడు అనీల్ రావిపూడితో మహేష్ సినిమా పూర్తి చేస్తాడనే వార్తలు ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తున్నాయి.

అనీల్ రావిపూడితో 'సుప్రీం','రాజా ది గ్రేట్', 'ఎఫ్ 2' వంటి సినిమాలు చేసిన దిల్ రాజు ఇప్పుడు ఈ సినిమాను కూడా నిర్మించాలని భావిస్తున్నాడు. నిజానికి దిల్ రాజు.. అనీల్ ని తన క్యాంప్ నుండి బయటకి వెళ్లనివ్వకుండా మహేష్ తో సినిమా సెట్ చేయిస్తున్నాడని మరో టాక్ కూడా ఉంది.

ఈ సినిమాకి దిల్ రాజుతో పాటు అనీల్ సున్కర్ కూడా భాగస్వామిగా ఉంటాడని సమాచారం. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.