దిల్ రాజు నిర్మించిన శ్రీనివాస కళ్యాణం సినిమా సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిత్రబృందం తాము గొప్ప సినిమా తీశామని కానీ సోషల్ మీడియాలో నెగెటివ్ ప్రచారం చేస్తున్నారని వాపోయారు. ముందుగా ఈ సినిమాపై నెగెటివ్ టాక్ వస్తున్నందుకు దిల్ రాజు ఆందోళన వ్యక్తం చేశారు. 'పదిహేను ఏళ్లలో ముప్పై సినిమా తీశాను. కానీ ఏ సినిమా విషయంలో ఇంత గందరగోళానికి గురి కాలేదు.

లవర్ సినిమా వర్కవుట్ కాలేదని మూడో రోజే తెలిసిపోయింది. 'శ్రీనివాస కళ్యాణం' సినిమా చూసినవారంతా సినిమా బాగుందని మెచ్చుకుంటుంటే సోషల్ మీడియాలో మాత్రం నెగెటివ్ గా మాట్లాడడం బాధను కలిగించింది. ఈ సినిమా చూసిన ఫ్యామిలీ ఆడియన్స్ ఒక రకంగా స్పందిస్తుంటే, యూత్ మరో రకంగా స్పందిస్తున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల ఒపీనియన్ తీసుకోవడానికి ఒక కాంటెస్ట్ రన్ చేశాం.

సినిమా చాలా బాగుంది, బాగుంది, పర్వాలేదు, బాగాలేదు అనే ఆప్షన్స్ ఇస్తే.. తొంబై శాతం మంది చాలా బాగుందని చెప్పారు. సోషల్ మీడియాలో మాత్రం రివ్యూలు చూసి తొలిసారి కన్ఫ్యూజన్ కి గురయ్యాను'' అంటూ వెల్లడించారు. అంతేకాదు.. దర్శకుడు సతీష్ వేగ్నేశతో 'థాంక్యూ' అనే మరో సినిమా చేయనున్నట్లు ప్రకటించారు.