ప్రముఖ నిర్మాణ దిల్ రాజు పలు ప్రాజెక్ట్ లతో బిజీగా గడుపుతున్నారు. నిర్మాతగా మాత్రమే కాకుండా డిస్ట్రిబ్యూటర్ గా కూడా అతడికి మంచి పేరుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా సినిమాలను ఆయనే రిలీజ్ చేస్తుంటారు. గతేడాది దిల్ రాజు.. పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన 'మెహబూబా' సినిమాను రిలీజ్ చేశారు.

అయితే ఈ సినిమా పెద్దగా ఆడలేదు. దీంతో కొంతకాలం గ్యాప్ తీసుకున్న పూరి తాజాగా ఓ సినిమా రెడీ చేశాడు. అదే 'ఇస్మార్ట్ శంకర్'.. రామ్ హీరోగా నటించిన ఈ సినిమాలో నభానటేష్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. 

ఈ సినిమాను జూలై 18న రిలీజ్ చేయడానికి సిద్ధం చేస్తున్నారు. దర్శకుడు పూరి అతడి చిత్రబృందం.. నిర్మాత దిల్ రాజుని కలిసి సినిమాను రిలీజ్ చేయమని కోరారు.  కానీ దిల్ రాజు మాత్రం దానికి నో చెప్పేశారట. ప్రస్తుతం తను చాలా బిజీ ఉన్నానని, చాలా సినిమాలు లైన్ లో ఉన్నాయని సినిమా రిలీజ్ చేయలేనని నిర్మొహమాటంగా చెప్పినట్లు  తెలుస్తోంది.

దీంతో పూరి మరో ఆప్షన్ కోసం చూస్తున్నాడు. ఇటీవల విడుదలైన 'ఇస్మార్ట్ శంకర్' ట్రైలర్ కి ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వస్తోంది. అయినప్పటికీ సినిమా డిజిటల్ రైట్స్ భారీ రేట్లకు అమ్ముడిపోయాయి. ప్రస్తుతం సినిమా థియేట్రికల్ రైట్స్ బిజినెస్ జరుగుతోంది.