వరసపెట్టి సూప‌ర్‌డూప‌ర్ హిట్ చిత్రాల‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్న శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌ బ్యానర్ పై కొత్త సినిమా ప్రారంభమైంది. రాజ్ త‌రుణ్ హీరోగా ‘ఇద్ద‌రి లోకం ఒక‌టే’ అనే టైటిల్ తో ఈ చిత్రం రూపొందనుంది.  జి.ఆర్‌.కృష్ణ ద‌ర్శ‌కత్వం  వహిస్తున్న ... నిర్మాతలు దిల్‌ రాజు, శిరీష్ ఆధ్వ‌ర్యంలో పూజా కార్య‌క్ర‌మాలను నిర్వ‌హించారు.

ఇక ముహుర్త‌పు స‌న్నివేశానికి ‘బాహుబలి’ రచయిత వి. విజ‌యేంద్ర ప్ర‌సాద్ క్లాప్ కొట్ట‌గా, ప్ర‌సాద్ కెమెరా స్విచ్చాన్ చేశారు. దిల్‌ రాజు మ‌న‌వ‌డు మాస్ట‌ర్ ఆరాన్ష్ గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

దిల్‌ రాజు మాట్లాడుతూ “మా బేనర్‌లో ‘ఇద్ద‌రి లోకం ఒక‌టే’ అనేది రాజ్‌త‌రుణ్‌తో చేస్తోన్న రెండో చిత్రం. జి.ఆర్‌.కృష్ణ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. యూత్‌, ఫ్యామిలీ ఆడియెన్స్‌కు న‌చ్చేలా సినిమా ఉంటుంది. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన వివ‌రాల‌ను తెలియ‌జేస్తాం” అన్నారు.

ఈ సినిమా లో హీరోయిన్ మరియు ఇతర కాస్ట్ అండ్ క్రూ వివరాలు త్వరలో తెలియనున్నాయి. ఈ చిత్రానికి మిక్కీ జె. మేయర్ సంగీతం సమకూరుస్తున్నారు. డైలాగ్స్‌:  అబ్బూరి ర‌వి, సినిమాటోగ్రఫీ: సమీర్ రెడ్డి, ఎడిట‌ర్: త‌మ్మిరాజు.