#Gamechanger రిలీజ్ పై శంకర్ కొత్త ప్లాన్, మొత్తం మార్చేసాడుగా
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ 'గేమ్ ఛేంజర్' రిలీజ్ డేట్‌పై దాదాపుగా ఓ క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది. ఆ డిటేల్స్

స్టార్ డైరెక్టర్ శంకర్ సామాజిక అంశాల కథలకు భారీ కమర్షియల్ హంగులను జోడించి అద్భుతంగా సినిమాలను తీర్చిదిద్దడంలో దిట్ట. లార్జన్ దేన్ లైఫ్‌గా సినిమాలను రూపొందించే ఆయన ప్రస్తుతం కమల్ హాసన్‌తో 'భారతీయుడు 2', రామ్‌చరణ్‌తో 'గేమ్ ఛేంజర్' చేస్తున్నారు. ఇవి రెండు కూడా సోషల్ మెసేజెస్ సినిమాలే. వీటిని కూడా భారీ హంగులతో ఓ రేంజిలో షూట్ చేస్తున్నారు. సినీ ప్రియులు కూడా ఈ రెండు చిత్రాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే మన తెలుగు వాళ్లంతా మాత్రం గేమ్ ఛేంజర్ పై దృష్టి పెట్టారు.
అయితే 'గేమ్ ఛేంజర్'పై సినిమా రిలీజ్ డేట్‌పై ఇప్పటివరకు ఓ స్పష్టత లేదు. వాయిదా పడుతూ వస్తోంది. ఆ మధ్యలో వచ్చే ఏడాది సంక్రాంతికి ఇది వస్తుందని కథనాలు మీడియాలో వచ్చాయి. కానీ భారతీయుడు 2 ఎంట్రీతో అదే ముందు వస్తుందని ఫిక్సై పోయారు. అయితే శంకర్ వేరే ప్లాన్స్ తో సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. భారతీయడు 2 చిత్రాన్ని 2024 ఇండిపెండెన్స్ డే కానుకగా అంటే ఆగస్ట్ 15 కు ఇవ్వాలనుకుంటున్నట్లు సమాచారం. కథకు ఆ డేట్ అయితేనే ఫెరఫెక్ట్ అని భావిస్తున్నారట. ఈ క్రమంలో 'గేమ్ ఛేంజర్' ముందుకు తీసుకువచ్చారని తెలుస్తోంది. దీంతో ఈ చిత్రాన్ని వచ్చే వేసవికి రిలీజ్ చేసేలా షూటింగ్ షెడ్యూల్స్‌ను ప్లాన్ చేశారని సమాచారం. అంటే ముందే గేమ్ ఛేంజర్ రాబోతోంది.
ఇప్పుడు ‘గేమ్ ఛేంజర్’ సినిమా విడుదల తేదీపై దాదాపుగా ఓ క్లారిటీ వచ్చినట్లు తెలిసింది. ఆల్మోస్ట్ దీన్నే కన్ఫామ్ చేయాలని మేకర్స్ అనుకుంటున్నారట. సినిమాను మార్చి మూడు లేదా నాలుగో వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారని ట్రేడ్ వర్గాల టాక్. అంటే నాలగైదు నెలల గ్యాప్‌లో శంకర్ తన రెండు భారీ చిత్రాలు భారతీయుడు 2, మార్చిలో గేమ్ ఛేంజర్‌ను.. విడుదల చేయనున్నారన్న మాట.
ఇక రీసెంట్ గా‘గేమ్ ఛేంజర్’రిలీజ్ గురించి గాంఢీవధారి అర్జున ఈవెంట్ కు వచ్చిన దిల్ రాజు కొన్ని కామెంట్స్ చేసారు. రిలీజ్ పై అయితే తుది నిర్ణయం శంకర్ గారిదే అని నిర్మాత దిల్ రాజు క్లారిటీ ఇచ్చేసారు. మీరు అందరూ ‘గేమ్ ఛేంజర్’అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలుసు. కానీ అవేమీ మన చేతిలో లేవు. డైరక్టర్ గారు ఇచ్చినప్పుడే డిటేల్స్ బయిటకు వస్తాయి. మనమేం చెయ్యలేము అమ్మా అంటూ దిల్ రాజు స్టేజిపై చెప్పారు.
దిల్ రాజు నిర్మిస్తున్న 50వ సినిమా కావడంతో బడ్జెట్ విషయంలో ఆయన ఎక్కడా రాజీ పడకూడదని నిర్ణయించుకున్నారట. ‘కేజీఎఫ్’లో అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు చేసిన అన్బు, అరివులు ‘గేమ్ ఛేంజర్’ కోసం రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమాలో ఫైటింగ్ సీన్స్‌పై అంచనాలు పెరిగాయి. ఇవే ఈ మూవీలో హైలైట్ కానున్నాయని సమాచారం. పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఇది రానుంది. ఇందులో చరణ్ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నాడనే టాక్ వినిపిస్తోంది. రామ్ చరణ్ సరసన కియారా అడ్వాణీ నటిస్తోన్న ఈ చిత్రానికి తమన్ స్వరాలు అందిస్తున్నారు. శ్రీకాంత్, అంజలి, ఎస్.జే.సూర్య, సునీల్ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు.