యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ఇప్పుడు సినిమా చేయడం అంత సులువైన విషయం కాదు. ప్రభాస్ తో సినిమా అంటే భారీ స్థాయిలో ఉండాలి. దేశంలో అన్ని ప్రధాన భాషల్లో ప్రభాస్ చిత్రాలు విడుదలవుతున్నాయి కాబట్టి నార్త్ ఆడియన్స్ కు కూడా నచ్చే కథలని ఎంపిక చేయాల్సి ఉంటుంది. ప్రభాస్ మాత్రం ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. బాహుబలి తర్వాత సాహో, రాధాకృష్ణ దర్శకత్వంలో మరో చిత్రాన్ని మాత్రమే అంగీకరించాడు. 

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రభాస్ తో సినిమా చేయాలని ఎంతగానో ప్రయత్నిస్తున్నా కుదరడం లేదు. ప్రభాస్ బాడీ లాంగ్వేజ్ కు సరిపడే కథని దిల్ రాజు సిద్ధం చేయించారట. ఆ కథని ప్రభాస్ కు వినిపించడానికి దిల్ రాజు రెండు సార్లు ప్రయత్నించినా కుదరలేదని సమాచారం. దిల్ రాజు మరో ప్రయత్నం చేస్తున్నారట. మున్నా, మిస్టర్ పర్ఫెక్ట్ తర్వాత ప్రభాస్ ని హ్యాట్రిక్ సినిమాకు ఒప్పించడానికి దిల్ రాజు సన్నాహకాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 

ఈ ఏడాది దిల్ రాజు ఎఫ్2, మహర్షి లాంటి సూపర్ హిట్స్ సొంతం చేసుకున్నారు. దిల్ రాజు ప్రస్తుతం మహేష్ నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు చిత్రానికి నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. ప్రభాస్ సాహో పూర్తికావచ్చింది. ఈ చిత్రం తర్వాత రాధాకృష్ణ దర్శకత్వంలోని చిత్రంతో ప్రభాస్ బిజీ అవుతాడు. ఒక వేళ దిల్ రాజు ప్రాజెక్ట్ ని ఓకే చేసినా అది పట్టాలెక్కేది వచ్చే ఏడాదే.