కరోనా వేళ సినిమా ఇండస్ట్రీ చాలా అనిశ్చితలో పడింది. ఎక్కడ సినిమా షూటింగ్ అక్కడే ఆగిపోయాయి. ఎప్పుడు సినిమాలు రిలీజ్ అవుతాయో తెలియని పరిస్దితి. ఇలాంటి పరిస్దితిని క్యాష్ చేసుకునేందుకు రంగంలోకి దిగిన ఓటీటి మార్కెట్. చిన్న నిర్మాతలకు ఓటీటిలు వేస్తున్న గేలం..ఎక్కువ రేటు తో థియోటర్ రిలీజ్ లేకుండా తమ దగ్గర రిలీజ్ చేసుకోమని అడుగుతున్న వైనం..చాలా మందిని ఎట్రాక్ట్ చేస్తోంది. వడ్డీలు కట్టుకునే బదులు ..ఎంతో కొంతకి వదిలించుకుందామనుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే థియోటర్స్ రిలీజ్ ఉండదు. అప్పటిదాకా వెయిట్ చేస్తే సినిమా నిమిత్తం తీసుకున్న ఫైనాన్స్ లు భారమైపోతాయి. ఇదే అందరి ఆలోచన. పెద్ద నిర్మాతలకు సైతం ఈ భారం మోయలేనిదే. ముఖ్యంగా నాలుగైదు ప్రాజెక్టులకు అడ్వాన్స్ లు ఇచ్చి, షూటింగ్ లు ఫినిష్ చేసుకుని రిలీజ్ కు ఎదురుచూస్తున్నారు దిల్ రాజు. ఈ నేఫధ్యంలో ఆయన దగ్గరకు రకరకాల ఆఫర్స్ వచ్చాయి. 
 
ముఖ్యంగా ఆయన తాజా చిత్రం  "V" సినిమా ఓటీటి లో రిలీజ్ చేస్తారంటూ మీడియాలో రూమర్స్ సైతం వచ్చాయి. ఇప్పుడున్న పరిస్దితుల్లో అంతకాలం వెయిట్ చేసి థియేటర్లలో కాకుండా మా డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లలో విడుదల చేస్తే భారీ మొత్తం ఇస్తామని ఓటిటీ కంపెనులు టెంప్టింగ్ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. నిర్మాత దిల్ రాజు అటు హీరో నాని, దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ  కుదరదన్నారు. కానీ వాళ్లు టెమ్టింగ్ ఆపర్ ఇచ్చారు.  ఏం జరుగుతుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో ఈ విషయమై పూర్తి క్లారిటీ వచ్చింది. ఎట్టి పరిస్థితిల్లోనూ సినిమాని ముందు థియేటర్లలోనే రిలీజ్ చెయ్యాలని దిల్ రాజు డిసైడ్ అయ్యినట్లు సమాచారం. 

బిగ్ స్క్రీన్ ఎక్స్ పీరియన్స్ కోసమే తను V సినిమా తీశానని చెప్పుకొచ్చాడు దిల్ రాజు. ఆఫర్ ఇచ్చిన  ఆ కంపెనీకి నో అని చెప్పేశాడు. ఇన్ని రోజులు ఊగిన ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించినట్లు సమాచారం. ఇది విన్న మిగతా నిర్మాతలు, ఇండస్ట్రీ పెద్దలు ఆయన్ని మెచ్చుకున్నట్లు సమాచారం. ఎందుకంటే దిల్ రాజు వంటి నిర్మాత తీసుకునే నిర్ణయం ఇండస్ట్రీపై ఎక్కువగా ఉంటుంది. ఆయన కనుక ఈ సినిమాని ఓటీటికి ఇఛ్చేసి ఉంటే మిగతా నిర్మాతలు కూడా ఒత్తిడికి తలఒగ్గి..వాళ్లు కూడా అదే దారిలో ప్రయాణం పెట్టుకునేవారు. ఆ విధంగా చూస్తే దిల్ రాజు నిర్ణయం చాలా గొప్పదనే చెప్పాలి. 
 
న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం 'వి' . ప్రముఖ దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ  దర్శకత్వం వహించిన ఈ సినిమా లాక్ డౌన్ తర్వాత ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఈ సినిమాలో నాని తో పాటు హీరో సుదీర్ బాబు కూడా నటిస్తూండటంతో సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. నివేద థామస్, అదితిరావు హైదరి హీరోయిన్లుగా నటిస్తున్న...ఈ సినిమాలో సుధీర్ బాబు పోలీస్ ఆఫీసర్ గా నటించగా, సీరియల్ కిల్లర్ గా నాని నటిస్తున్న సంగతి తెలిసిందే.