చిరంజీవికి ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి సర్ ప్రైజ్, మెగా ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్న టాలీవుడ్

తెలుగు సినిమా ఖ్యాతిని పెంచి..కీర్తి పతాక ఎగరవేస్తున్న నటుడు మెగాస్టార్ చిరంజీవి. ఆయన కోసం ప్రత్యేకగా మెగాఈవెంట్ నిర్వహించబోతోంది ఫిల్మ్ ఇండస్ట్రీ. ఈ విషయంలో క్లారిటీ ఇచ్చాడు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు. వివరాల్లోకి వెళ్తే..

Dil Raju Clarity about special event for Padma Vibhushan Megastar Chiranjeevi

తెలుగు సీనీపరిశ్రమ గర్వించదగ్గ నటులలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఒకరు.  దాదాపు 45 ఏళ్ళుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ.. ప్రస్తుతం టాలీవుడ్ కు పెద్ద దిక్కుగా ఉన్నారు. ఇండస్ట్రీ కష్టసుఖాలలో  అండగా ఉంటూ..  ఏ ఇబ్బంది వచ్చినా.. పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు. గతంలో ఫిల్మ్ ఇండస్ట్రీకి ఏ కష్టం వచ్చినా.. దాసరి నారాయణ రావు ఇంటికి పరిగెత్తేవారు.. ఆయన మరణం తరువాత మెగాస్టార్ చిరంజీవి వైపు అంతా చూస్తున్నారు. ఒక వైపు సినిమాలు చేసుకుంటూ.. మరో వైపు ఇండస్ట్రీ బాగోగుల చూస్తున్నారు మెగాస్టార్. అటువంటి చిరంజీవికి దేశంలోనే రెండో అత్యున్నత గౌరవం దక్కడంతో.. మెగా సన్మానానికి ఏర్పాట్లు చేయబోతుంది టాలీవుడ్. 

రిపబ్లిక్ డే  సందర్భంగా పద్మ అవార్డులని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. దేశవ్యాప్తంగా ఐదుగురు ప్రముఖులకు భారతదేశ రెండో అత్యున్నత అవార్డు పద్మ విభూషణ్ ప్రకటించారు.   17 మందికి ప్రముఖులకు  పద్మ భూషణ్ అవార్డులు, 110 మందికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించారు. ఇక ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు స్టార్లు ఉండగా.. అందులో ఇద్దరు ప్రముఖులకు అత్యున్నత పద్మ విభూషన్ ప్రకటించింది కేంద్రం. మెగాస్టార్ చిరంజీవికి సినీరంగానికి చేసిన సేవకుగాను పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించారు. దాంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు హర్షిస్తున్నారు. ప్రముఖులతో  పాటు సామాన్యులు, సెలబ్రిటీలు అన్న తేడా లేకుండా.. వీరిరువురకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

అయితే  మెగాస్టార్ కు ఈ అవార్డ్ రావడంతో.. ఇండస్ట్రీ చిరంజీవిని ఘనంగా సత్కరించడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టు తెలు్తోంది. అందుకోసం ఓ  మెగా ఈవెంట్ ను కూడా నిర్వహించాలని అనుకుంటున్నట్టుతెలుస్తోంది. మెగాస్టార్ కు శుభాకాంక్షలు తెలపడం కోసం టాలీవుడ్ నిర్మాత అలాగే తెలుగు సినిమా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ దిల్ రాజు కూడా ప్రత్యేకంగా వెళ్లి కలవడం జరిగింది.

అయితే తాను కలిసిన అనంతరం ఆయనకు ఈ అవార్డు రావడం చాలా ఆనందం కలిగించింది అని అయితే ఈ శుభ సందర్భంలో ఒక స్పెషల్ ఈవెంట్ ని తాము ప్లాన్ చేయాలని చూస్తున్నామని మిగతా వివరాలు త్వరలోనే అందిస్తామని దిల్ రాజు  తెలిపారు. దీనితో మెగాస్టార్ కి దక్కిన ఈ అరుదైన గౌరవానికి తెలుగు సినిమా తరపున ఒక గ్రాండ్ ట్రీట్ త్వరలోనే ఉండబోతుంది అని  తెలుస్తోంది. మరి ఈ ఆవెంట్ ను  ఏప్పుడు..? ఎలా ప్లాన్ చేస్తారో చూడాలి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios