హైదరాబాద్ సిటీ మొత్తం మీద సింగిల్ స్క్రీన్లు 96 ఉండగా, అందులో 90 స్క్రీన్లలో గుంటూరు కారం వేస్తున్నారు. అదేరోజు విడుదలవుతున్న హనుమాన్ చిత్రం మాత్రం కేవలం నాలుగైదు థియేటర్లతో సరిపెట్టుకోవాల్సి వస్తోందని సమాచారం.
ఈ సంక్రాంతికి గుంటూరు కారంతోపాటు హనుమాన్, సైంధవ్, ఈగల్, నా సామిరంగ చిత్రాలు కూడా విడుదల కానున్నాయి. దీంతో థియేటర్ల కోసం పోటీ ఓ రేంజిలో ఏర్పడింది. అయితే అనుభవం ఉన్న దిల్ రాజు ఆ పోటీని తన తెలివితో ఎలా దాటుతున్నారో గమనిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. గుంటూరు కారం సినిమా నైజాం డిస్ట్రిబ్యూషన్ హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు పొందిన సంగతి తెలిసిందే. దాంతో దిల్ రాజు ఒక వ్యూహాన్ని రూపొందించారు. తెలంగాణ వ్యాప్తంగా ఎన్ని సింగిల్ స్క్రీన్లు ఉంటాయో వాటిల్లో 95 శాతం విడుదలైన మొదటిరోజే గుంటూరు కారం ప్రదర్శించే ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ సిటీ మొత్తం మీద సింగిల్ స్క్రీన్లు 96 ఉండగా, అందులో 90 స్క్రీన్లలో గుంటూరు కారం వేస్తున్నారు. అదేరోజు విడుదలవుతున్న హనుమాన్ చిత్రం మాత్రం కేవలం నాలుగైదు థియేటర్లతో సరిపెట్టుకోవాల్సి వస్తోందని సమాచారం.
సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘గుంటూరు కారం’చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది. మహేష్ కు జోడీగా శ్రీలీలా నటిస్తున్న ఈ చిత్రంపై మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ అన్ని సినిమా పై భారీగా అంచనాలను పెంచేస్తున్నాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఓ రేంజిలో జరిగినట్లు సమాచారం. దాదాపు వందకోట్లు దాకా బిజినెస్ జరిగినట్లు చెప్తున్నారు. అలాగే సినిమా మహేష్ పేరు కూడా బయిటకు వచ్చింది. ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాలో మహేష్ బాబు పేరు వెంకట రమణారెడ్డి అలియాస్ రవణ. గుంటూరులో మిర్చి వ్యాపారం చేస్తుంటాడు.
సంక్రాంతి కానుకగా జనవరి 12న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే సినిమా రిలీజ్‌ను ఉద్దేశించి తాజాగా చిత్ర నిర్మాత నాగవంశీ ట్వీట్ చేశారు. ఈ చిత్రాన్ని ఉద్దేశించి గతంలో ఓ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ క్లిప్‌ను ఆయన షేర్ చేశారు. ‘‘ప్రతి ఏరియాలో రాజమౌళి కలెక్షన్స్‌కు దగ్గరగా వెళ్తాం. కంటెంట్ విషయంలో నేను నమ్మకంగా ఉన్నా’’ అని ఆయన చెప్పారు.
తాజాగా ఈ వీడియో క్లిప్‌ను షేర్ చేసిన ఆయన.. ‘‘మీకు మళ్లీ చెబుతున్నా. మేము అదే మాట మీద ఉన్నాం.‘గుంటూరు కారం’ను భారీగా విడుదల చేస్తాం. రిలీజ్ మాకు వదిలేయండి. సెలబ్రేషన్స్ ఏమాత్రం తగ్గకుండా చూసుకునే బాధ్యత మీదే’’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.
అతడు’, ‘ఖలేజా’ తర్వాత మహేశ్‌బాబు - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రమిది. యాక్షన్ డ్రామాగా ఇది సిద్ధమవుతోంది. శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలు. జగపతి బాబు, జయరాం, ప్రకాశ్‌రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ దీనిని నిర్మిస్తున్నారు.
గుంటూరు కారం చిత్రంలో శ్రీలలో పాటు హీరోయిన్ మీనాక్షీ చౌదరి, ప్రకాష్‌రాజ్, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్న ‘గుంటూరు కారం’ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది.. అతడు, ఖలేజా చిత్రాల తర్వాత మహేష్‌బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలేర్పడ్డాయి. మహేశ్ - త్రివిక్రమ్ స్టైల్ మాస్ అంశాలతో ఈ చిత్రం రూపొందుతోంది.
