విలక్షణ దర్శకుడు రవిబాబు మరో కొత్త కాన్సెప్ట్ తో ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేయడానికి వచ్చాడు. ఆవిరి అనే డిఫరెంట్ టైటిల్ తో ఒక హారర్ మూవీని తెరకెక్కిస్తున్న రవి బాబు త్వరలోనే ఆ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. అయితే ఈ సినిమా కోసం దిల్ రాజు కూడా రంగంలోకి దిగారు. 

దిల్ రాజు ప్రొడక్షన్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో ఆవిరి మూవీ గ్రాండ్ గా విడుదల కానున్నట్లు రవిబాబు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశారు.'చాలా రోజులుగా దిల్ రాజుగారితో ఒక సినిమా చేయాలని అనుకున్నా. నా 15 ఏళ్ల కెరీర్ లో ఇన్నాళ్లకు ఆయనతో వర్క్ చేసే అవకాశం దక్కింది. అదే విధంగా దిల్ రాజు ప్రొడక్షన్ లో మొదటి సారి ఎవరు ఊహించని విధంగా సప్సేన్స్ హారర్ థ్రిల్లర్ మూవీ రాబోతోంది. 

ప్రస్తుతం సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉందని వీలైనంత త్వరగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాము' అని రవిబాబు చెప్పాడు. ఇక చిత్ర యూనిట్ నుంచి అందిన సమాచారం ప్రకారం ఆవిరి సినిమా అక్టోబర్ లో రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.