Asianet News TeluguAsianet News Telugu

బోయపాటితో దిల్ రాజు ..భారీ ప్రాజెక్టే, హీరో అతనేనా?

బోయపాటి శ్రీను తొలి సినిమా ‘భద్ర’ను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించారు. 2015లో ఈ చిత్రం విడుదలైంది. ఆ తరవాత మరో సినిమాను ఇదే బ్యానర్‌లో బోయపాటి చేయలేదు.

Dil Raju and Boyapati Sreenu to team up? jsp
Author
First Published Oct 10, 2023, 11:37 AM IST


రామ్ హీరోగా బోయపాటి తీసిన “స్కంద” సెప్టెంబర్ 28న విడుదలై ఫ్లాఫ్ టాక్ తెచ్చుకుంది. రామ్ తన నెక్ట్స్ ప్రాజెక్టులోకి వెళ్లిపోయాడు. శ్రీలీల వరస సినిమాలతో బిజీగా ఉంది. దర్శకుడు బోయపాటి శ్రీను సైతం ఓ స్క్రిప్టుని రెడీ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ సారి దిల్ రాజు నుంచి బోయపాటికు పిలుపు వచ్చిందని తెలుస్తోంది. బోయపాటిని దర్శకుడుగా భద్రతో పరిచయం చేసింది దిల్ రాజు. ఆ తర్వాత మళ్లీ వీళ్లిద్దరూ కలిసి పనిచేయలేదు. బోయపాటి శ్రీను తొలి సినిమా ‘భద్ర’ను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించారు. 2015లో ఈ చిత్రం విడుదలైంది.  అయితే ఇప్పుడు మరోసారి వీళ్లిద్దరి కాంబినేషన్ కు రంగం సిద్దమవుతోందని మీడియా వర్గాల సమాచారం.

అయితే అది హీరో సూర్యతోనా మరొకరితోనా అనేది క్లారిటీ లేదు. అయితే హీరో సూర్య, కార్తి వీళ్లద్దరితో దిల్ రాజుకు మంచి ర్యాపో ఉంది.  వాళ్లిద్దరూ దిల్ రాజుతో కలిసి పనిచేయాలనే అనుకుంటున్నారు. అందులోనూ విజయ్ తో తమిళంలో దిల్ రాజు సినిమా చేసాక...అక్కడ తమిళ హీరోల దృష్టి దిల్ రాజుపై పడింది. బారీగా నిర్మించటం, ఎగ్రిసివ్ గా ప్రమోట్ చేయటం వారికి నచ్చింది. కాబట్టి బోయపాటితో దిల్ రాజు తమిళ హీరోనే సెట్ చేసే అవకాసం ఉందంటున్నారు.  అయితే స్క్రిప్టు దిల్ రాజు కంట్రోల్ లో జరుగుతుంది.  
 
 బోయపాటి-సూర్య చిత్రం కన్ఫామ్ అయితే కనుక వచ్చే ఏడాదిలో సినిమా ప్రారంభం అవనుంది. దాంతో, తెలుగు, తమిళ భాషల్లో సరికొత్త కాంబినేషన్ అభిమానులను అలరించనుంది.  బోయపాటి శ్రీను మాస్ మసాలా చిత్రాలకు ఫేమస్ కాగా.. సూర్య కూడా మాస్ క్యారక్టర్స్ లో మెప్పించగలడు. ఈ ఇద్దరి కాంబోలో వస్తే సినిమా తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో ఓ రేంజిలో బజ్ క్రియేట్ చేస్తుంది. బోయపాటి గతంలో అనేక  ఇంటర్వ్యూలలో సూర్యతో కలిసి పనిచేయాలనే తన కోరికను ప్రస్తావించారు. సూర్య ప్రస్తుతం ‘కంగువ’ అనే పాన్ ఇండియా చిత్రం చేస్తున్నాడు. స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శివ రపొందిస్తున్నాడు. బాలీవుడ్ నటి దిశా పటాని కథానాయికగా నటిస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా 10 భాషల్లో విడుదల కానుంది.

Follow Us:
Download App:
  • android
  • ios