సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నిర్మాత దిల్ రాజు 'మహర్షి' సినిమాను నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను ముందుగా ఏప్రిల్ 5న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

కానీ రీసెంట్ గా సినిమా డేట్ వాయిదా పడిందని వార్తలు వినిపించాయి. ఈ విషయంపై నిర్మాత దిల్ రాజు క్లారిటీ ఇచ్చేశాడు. వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవడం కోసం తిరుమలకి వెళ్లిన దిల్ రాజు 'మహర్షి' సినిమా డేట్ ని అనౌన్స్ చేశారు.

ఏప్రిల్ 25న సినిమాను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. వేసవి సీజన్ కావడంతో మహేష్ సినిమా మంచి డేట్ లాక్ చేసుకుందనే చెప్పాలి. ఏప్రిల్ 18న లారెన్స్ 'కాంచన 3', నాని 'జెర్సీ' ఏప్రిల్ 19న రాబోతున్నాయి. ఆ తదుపరి వారమే మహేష్ సినిమా రాబోతుంది.

ఈ సమ్మర్ లో మహేష్ సినిమా హిట్టు కొట్టడం ఖాయమని భావిస్తున్నారు అభిమానులు. ఈ సినిమాతో పాటు దిల్ రాజు లైన్ లో మరో నాలుగు సినిమాలు ఉన్నట్లు వెల్లడించారు. ఆ నాలుగు కూడా ఈ ఏడాదిలోనే విడుదల చేస్తానని అన్నారు. 'మహర్షి' సినిమా ప్రస్తుతం సినిమా షూటింగ్ దశలో ఉంది.