టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ సక్సెస్ రేట్ కలిగిన నిర్మాతల్లో ఒకరు దిల్ రాజు. రీసెంట్ గా F2 తో నిర్మాతగా కెరీర్ లో మరో బాక్స్ ఆఫీస్ హిట్టందుకున్న రాజు ఇప్పటివరకు తన ప్రొడక్షన్ హౌస్ లో 31 సినిమాలను విడుదల చేశారు. అయితే అందులో తన ఫేవరేట్ సినిమాలు కొన్ని మాత్రమే ఉన్నాయంటూ 7 సినిమాల గురించి చెప్పిన ఆయన మహేష్ - వెంకీ మల్టీస్టారర్ ను మాత్రం పక్కనపెట్టాశారు. 

కేవలం తనకు సంతృప్తి ఇచ్చిన సినిమాలు బొమ్మరిల్లు - ఆర్య - కొత్త బంగారు లోకం - మిస్టర్ పర్ ఫెక్ట్ - బృందావనం - శతమానం భవతి - ఎఫ్2 సినిమాలు అని దిల్ రాజు వివరణ ఇచ్చారు. అయితే మల్టీస్టారర్ ట్రెండ్ ను చాలా కాలం తరువాత మొదలెట్టిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అంతగా సంతృప్తినివ్వకపోవడానికి కారణం ఏమిటో అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. 

కలెక్షన్స్ కూడా ఆ సినిమాకు బాగానే వచ్చాయి. పైగా మహేష్ కి ఇష్టమైన సినిమా. ఆ సినిమాను నమ్మే మరోసారి శ్రీకాంత్ అడ్డాలను నమ్మి బ్రహ్మోత్సవం చేశాడు. అయితే ఎక్కువగా లాభాలతో పాటు సంతృప్తిని ఇచ్చిన సినిమాల్లో మాత్రం బొమ్మరిల్లు టాప్ 1 లో ఉంటుందని దిల్ రాజు తెలియజేశాడు.