బాలీవుడ్ హీరోయిన్ శ్రద్దా కపూర్ కు సడెన్ గా షాక్ ఇచ్చాడు ఆమె డైహార్ట్ ఫ్యాన్ ఓకరు. ఆ అభిమాని చేసిన పనికి ఆమెకు ఏం చేయ్యాలో.. ఎం చెప్పాలో కూడా అర్ధం కాలేదు. ఇంతకీ అతను అంతలా ఏం చేశాడు. 

బాలీవుడ్ తో పాటు తెలుగు ఆడియన్స్ కు కూడా సుపరిచితురాలు.. హీరోయిన్ శ్రద్దా కపూర్. దేశ మంత అన్నిభాషల్లో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈ భామ.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో కలిసి పాన్ ఇండియా మూవీ సాహోలో నటించి మెప్పించింది. గ్లామరస్‌ రోల్స్‌తోపాటు నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లో నటిస్తూ మంచి క్రేజ్‌ సంపాదించుకుంది. అంతే కాదు శ్రద్దా కపూర్ కు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఈమధ్య సినిమాల స్పీడ్ కాస్త తగ్గింది శ్రద్దా కపూర్ ది. 

ఇక తాజాగా శ్రద్దా కపూర్ కు విచిత్రమైన అనుభవం ఎదురయ్యింది. రీసెంట్ గా ఆమె ముంబై ఎయిర్‌పోర్టు లో ఉండగా.. శ్రద్ధాకపూర్‌ను చూసిన ఓ అభిమాని సంతోషంపనట్టలేకపోయాడు.. అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తన అభిమాన నటి.. తను ప్రాణంగా అభిమానించే హీరోయిన్ కళ్లముందు కనిపించే సరికి ఏం చెయ్యాలో అర్ధం కాలేదు అతనికి. తనపై అభిమానాన్ని ఎలా చెప్పుకోవాలో కూడా అర్ధం కాలేదు ఆఫ్యాన్ కు. 

శ్రద్ధాకపూర్ అలా కనిపించగానే ఇలా అతను చేసిన పనికి అంతా ఆశ్చర్యపోయారు. కారులో నుంచి దిగింది. శ్రద్ధాకపూర్ ను చూసి వెంటనే దగ్గరొచ్చిన అభిమాని.. ఆమెకు ఫిదా అవుతూ మోకాళ్లపై నిలబడి పూల బొకే అందజేస్తూ.. ప్రపోజ్ చేశాడు. తన పట్ల ఫ్యాన్‌ చూపుతున్న అభిమానానికి శ్రద్ధాకపూర్ కూడా ఫిదా అయిపోయింది. ఆ తర్వాత ఫేవరేట్‌ హీరోయిన్‌కు షేక్ హ్యాండ్‌ ఇచ్చి.. ఫొటోలు దిగాడు ఆ అభిమాని. ఆ సన్నివేశం అక్కడ ఉన్నవారికి ఆకట్టుకుంది. అంత ఈ సీన్ చూస్తూ షాక్ అయ్యారు. 

Scroll to load tweet…

అంతే కాదు ఇలాంటి దృశ్యం కనిపిస్తే.. మనవారు ఊరుకుంటారా..? వెంటనే అక్కడే ఉన్న ఫొటోగ్రాఫర్లు తమ కెమెరాల్లో బంధించారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం ట్రెండింగ్లో కూడా ఉంది. ఇక శద్దా సినిమాల విషయానికి వస్తే.. రీసెంట్‌గా రణ్‌బీర్‌కపూర్‌తో కలిసి Tu Jhoothi Main Makkaarలో మెరిసింది శ్రద్ధాకపూర్. ప్రస్తుతం Stree 2 లో నటిస్తోండగా.. ఆ మూవీ షూటింగ్ దశలో ఉంది.