ఇటీవల ప్రభాకర్‌రెడ్డి ఆ కాలంలో దాదాపు 64.2ఎకరాల భూమిని చిత్ర పూరి కాలనీ కోసం దానం చేశారని, దాని విలువ ఇప్పుడు సుమారు రూ.500కోట్లు ఉంటుందని ఇటీవల ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది.
ఇటీవల కాలంలో వివాదాలు లేకుండా ఏ అంశం ఉండటం లేదు. కొందరు కావాలని తప్పుడు ప్రచారం చేయడంగానీ, మరికొందరు దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేయడం ఓ వైపు.. లేదంటే నిజాలను వక్రీకరించే ప్రయత్నం చేయడం మరోవైపు జరుగుతున్నాయి. తాజాగా నటుడు, దర్శకుడు ఎం.ప్రభాకర్ రెడ్డి విషయంలో అదే జరిగింది.
ఇటీవల ప్రభాకర్‌రెడ్డి ఆ కాలంలో దాదాపు 64.2ఎకరాల భూమిని చిత్ర పూరి కాలనీ కోసం దానం చేశారని, దాని విలువ ఇప్పుడు సుమారు రూ.500కోట్లు ఉంటుందని ఇటీవల ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ఇది చదివి అంతా శెభాష్ అంటూ ఆయనపై ప్రశంసలు కురిపించారు. కానీ దీనికి మరో వాదన ఇప్పుడు స్టార్ట్ అయ్యింది. సినీ ప్రముఖులు స్పందిస్తూ ఇందులో వాస్తవం లేదంటున్నారు.
ఆ మొత్తం భూమిని ఆనాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ఇచ్చిందని అంటున్నారు. కొందరు ఆయన ప్రతిష్ట దెబ్బతీసేందుకు ఇలా వక్రీకరిస్తున్నారని అంటున్నారు. అయితే ఆ భూమిని సాధించడంతో ప్రభాకర్‌రెడ్డినే కీలక భూమిక పోషించారని, సినీ కార్మికుల కోసం ఆయన ఎంతో పోరాటం చేశారని తెలిపారు. ఆ కాలనీ ఏర్పాటుకు అసలు కారకుడు ప్రభాకర్ రెడ్డినే అని అంటున్నారు.
తెలుగు సినీ పరిశ్రమ స్వరాష్ట్రంలో నెలకొనాలని కృషి చేసిన వారెందరో ఉన్నారు. ప్రభుత్వం నుండి సినీకార్మికుల వసతి కోసం తగిన స్థలాన్ని రాబట్టడంలో ప్రభాకర్ రెడ్డి ఎంతగానో కృషి చేశారు. అందుకే సినీకార్మికులు ఈ నాటికీ ఆయనను తలచుకుంటూనే ఉన్నారు. అయితే సినీకార్మికుల కోసం పాటు పడిన ప్రభాకర్ రెడ్డి ప్రతిష్ఠకు భంగంవాటిల్లేలా కొందరు ఆయన చేయని దానాన్ని చేసినట్టుగా ప్రచారం చేస్తున్నారు. అది విచారకరమంటున్నారు.
