మెగాస్టార్ చిరంజివి   గుప్తదానాలు చాలా ఉన్నాయి.   ప్రతిరోజు నాలుగైదు లక్షలు ఆయన దానం చేస్తుంటారు.. వచ్చిన వారికి వచ్చినట్టుగా ఆయన చెక్కులు రాస్తూనే ఉంటారు.


 చిరంజీవి ..కేవలం సినిమాల వరకే మెగాస్టార్ కాదు..దానాల్లోనూ ఆయన మెగాస్టారే. ఎప్పటికప్పుడు తన దాన గుణాన్ని విస్తరించుకుంటూ ముందుకు వెళ్తున్నారు. 1980 నుంచి ఆయన ఈ ఛారిటీ మోడ్ లోకి వచ్చినా... 1988 నుంచి పూర్తి స్దాయిలో కనస్ట్రక్టివ్ గా ఛారిటీలకు ఓ రూపం కలిగిస్తూ ఐ బ్యాంక్, బ్లడ్ బ్యాండ్ నెలకొల్పారు. ఇన్నేళ్ళ్లలో ఇత‌ర‌త్రా ఎన్ని కార్య‌క్ర‌మాలు చేప‌ట్టినా… ర‌క్త దానాన్ని మాత్రం మెగాస్టార్ చిరంజీవి వ‌దిలేయ‌లేదు. చిరంజీవి బ్ల‌డ్ అండ్ ఐబ్యాంక్ సేవలను విస్తరిస్తూనే ఉన్నారు. ఏటా తాను ర‌క్త‌దానం చేస్తూ త‌న అభిమానుల‌తో పాటు పెద్ద సంఖ్య‌లో యువ‌త‌ను ఆ దిశ‌గా న‌డిపిస్తూ చిరంజీవి సాగుతున్నారు. కోవిడ్ టైమ్ లోనూ నిర్మాణాత్మక కార్యక్రమాల వైపు దృష్టి సారించారు. 

ఈ సమయంలో చాలా మంది పేద కళాకారులు, సినీ కార్మికులు ఉపాధిని కోల్పోయారు. వారిని ఆదుకోవడానికి మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్ ఛారిటీ (సి.సి.సి.) ‘మనకోసం’ను ప్రారంభించారు. నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు.. ఒక్కసారి కాదు.. మూడుసార్లు సరుకులు పంపిణీ చేశారు. ఆ కార్యక్రమానికి ఇండస్ట్రీలో ఉన్న చాలామంది సాయం చేశారు. అలాగే ఆక్సిజన్ సిలెండర్లకోసం చాలా ఖర్చు చేశారు.ఇండస్ట్రీకి ఏ అవసరం ఉన్నా ఆయన ముందుకు వస్తున్నారు.. సమస్యల్ని పరిష్కరిస్తున్నారు. 

అలాగే ఆయన చేసే గుప్తదానాలు చాలా ఉన్నాయి. ప్రతిరోజు నాలుగైదు లక్షలు ఆయన దానం చేస్తుంటారు.. వచ్చిన వారికి వచ్చినట్టుగా ఆయన చెక్కులు రాస్తూనే ఉంటారు. లక్ష, రెండు లక్షలు ఇలా చాలా వరకూ ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటారు. కానీ ఆయన చేసిన దానం గురించి పబ్లిసిటీ చేసుకోరు. ఈ విషయాలు చాలామందికి తెలియదు. 
 అందుకే ఆయన్ని విమర్శించిన వారు కూడా ఇప్పుడు ఆయన చేస్తున్న ఛారిటీ, సేవల గురించి మెచ్చుకుంటున్నారు. మెగాస్టార్ ఇంతగా దానాలు చెయ్యడం వెనుక ఓ కారణం ఉంది. దాని గురించి ఇటీవల చిరంజీవి వివరించారు.

 ఇన్నాళ్లూ కుటుంబం గురించే ఆలోచించాన‌ని.. ఇక స‌మాజానికి తిరిగివ్వ‌డం మీద దృష్టిపెడ‌తాన‌ని చిరు అన్నారు. ఎంతో స్టార్ డమ్ చూసిన గొప్ప నటులు, దర్శకనిర్మాతలు చివరి దశల్లో చాలా కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు చూశారని అన్నారు.

ఎంత సంపాదించినా.. చివరికి ఏమీ కూడబెట్టుకోలేకపోయారని.. అందుకే తన కుటుంబానికి ఆస్తులు కూడబెట్టాలి అన్నట్లుగా మొదట్లో ఉండేవాడినని చిరు అన్నారు. ఇప్పుడు ఆ అవసరం లేదని.. పిల్లలందరూ జీవితంలో మంచి స్థాయిలో స్థిరపడ్డారని.. ఇప్పుడు వారికోసం కూడబెట్టాల్సిన అవసరం లేదని అన్నారు. భగవంతుడు అనుకున్న దానికంటే ఎక్కువే ఇచ్చాడని.. ఇప్పుడు దాన్ని సమాజానికి తిరిగి ఇవ్వాలనుకుంటున్నట్లు చెప్పారు.

కీర్తి, గ్లామర్ శాశ్వతం కాదని.. వ్యక్తిత్వమే శాశ్వతమని నమ్ముతానని చిరు అన్నారు. ఇకపై తన జీవితం ఛారిటీకే అంకితమని.. ఎంతైనా దానం చేస్తానని అన్నారు. సినిమాల ద్వారా వస్తోన్న డబ్బు కూడా ఛారిటీకే ఉపయోగిస్తున్నానని చిరు అన్నారు. “ఇకపై నా జీవితం ఛారిటీకే అంకితం. ఎంతైనా దానం చేస్తాను. చేస్తున్న సినిమాల ద్వారా వస్తున్న డబ్బు కూడా ఛారిటీకే ఉపయోగిస్తున్నా.”ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన నటించిన ‘వాల్తేర్ వీరయ్య’ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.