రవితేజ నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ `రావణాసుర` ఈ శుక్రవారం విడుదల కాబోతుంది. అయితే ఇది రీమేక్‌ సినిమా అనే వార్త నెట్టింట వైరల్‌ అవుతుంది. 

మాస్‌ మహారాజా రవితేజ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ మూవీ `రావణాసుర`. సుధీర్‌ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఈ శుక్రవారం ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. ఇందులో హీరో సుశాంత్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయనది నెగటివ్‌ రోల్‌ అని తెలుస్తుంది. ఐదుగురు హీరోయిన్లతో తెరకెక్కిన ఈ సినిమాకి సంబంధించిన ఓ షాకింగ్‌ విషయం నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ సినిమా రీమేక్‌ అని తెలుస్తుంది. 

`రావణాసుర`.. నాలుగేళ్ల క్రితం బెంగాలీలో వచ్చిన `విన్సి డా` చిత్రానికి రీమేక్‌ అని తెలుస్తుంది. శ్రీజిత్‌ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రుద్రానిల్‌ ఘోస్‌, రిత్విక్‌ చక్రబోర్తి, సోహిని సర్కార్‌, అనిర్బన్‌ భట్టాచార్య, రిద్ది సేన్‌ ముఖ్య పాత్రలు పోషించారు. 2019లో విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. విమర్శకుల ప్రశంసలుకుంది. ఈ సినిమాని `రావణాసుర`గా తెలుగులో రీమేక్‌ చేసినట్టు సమాచారం. అయితే ఈ రీమేక్‌ రైట్స్ కొనే రీమేక్‌ చేశారని, కాకపోతే చాలా మార్పులు చేసినట్టు సమాచారం. 

మాతృకలో.. ఓ మేకప్‌ ఆర్టిస్ట్ అనుకోకుండా మర్డర్‌ కేసులో ఇరుక్కోవడం, ఆ ఆర్టిస్టుని తయారు చేసిన మేకప్‌తో ఓ పాపులర్‌ లాయర్‌ నేరాలకు పాల్పడటం, అతను నేరాలకు పాల్పడం వెనకాల ఉన్న కారణాలతో `విన్సి దా` చిత్రం రూపొందిందని తెలుస్తుంది. ఇక రవితేజ నటించిన `రావణాసుర` కథ కూడా ఇంచు మించు అలానే ఉంది. ఆయన పాపులర్‌ లాయర్‌. చట్టాలను అడ్డుపెట్టుకుని ఆయన నేరాలకు పాల్పడుతుంటాడు. ఆయన క్రిమినల్‌గా ఎందుకు మారాడనేది ఈ సినిమా కథగా ఉండబోతుందని తెలుస్తుంది. ముందు నుంచి విలన్‌గా కనిపించే పాత్రలన్నీ చివర్లో విలన్లుగా, విలన్‌గా కనిపించే పాత్రలన్నీ చివర్లో హీరోలుగా కనిపిస్తాయని సమచారం.

YouTube video player

అయితే ఈ సినిమా `విన్సి దా` రీమేక్‌ అనే వార్తలపై దర్శకుడు సుధీర్‌వర్మ స్పందించారు. ఇది రీమేక్‌ కాదని వెల్లడించారు. బెంగాలీ సినిమాకి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆ సినిమా చూసి, ఈ సినిమా చూడండి అని, పోలిక కనిపిస్తే చెప్పండంటూ ఆయన వెల్లడించారు. ఏది నిజమనేది ఏప్రిల్‌ 7న తేలనుంది. ఈ సినిమా ఏడున రిలీజ్‌ కానున్న విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రంలో చాలా థ్రిల్లింగ్‌ పాయింట్లు, ట్విస్టులుంటాయని, అవి థియేటర్లో ఫుల్‌ కిక్‌నిస్తాయని అన్నారు దర్శకుడు సుధీర్‌ వర్మ.