మహేష్ బాబు నటించిన 'భరత్ అనే నేను' సినిమాతో టాలీవుడ్ లో గుర్తింపు సంపాదించుకున్న నటి కైరా అద్వానీ ప్రస్తుతం తెలుగులో వరుస అవకాశాలు సంపాదించుకుంటూ కెరీర్ పరంగా దూసుకుపోతుంది. అయితే బాలీవుడ్ లో ఆమె హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో డేటింగ్ చేస్తుందని చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.

వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ప్రముఖ దర్శకుడు కరణ్ జోహార్ ఈ జంటని ఒక్కటి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడని బాలీవుడ్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

అయితే ఇవి కేవలం రూమర్లు మాత్రమేనని కొట్టిపారేసింది ఈ జంట. తాజాగా సిద్ధార్థ్ మాజీ ప్రేయసి అలియా భట్ చేసిన వ్యాఖ్యలతో సిద్ధార్థ్, కైరాల మధ్య రిలేషన్ ఉందని తెలుస్తోంది.

'కాఫీ విత్ కరణ్' కార్యక్రమానికి హాజరైన అలియా భట్ ని.. సిద్ధార్థ్ ఎవరితో డేటింగ్ చేయడానికి ఇష్టపడతాడని ప్రశ్నించగా.. ఆమె కైరా అద్వాని పేరు చెప్పింది. దీంతో వీరిద్దరి మధ్య రిలేషన్ నిజమేనని తేలిపోయింది. కానీ కైరా మాత్రం కెరీర్ తరువాత ఏదైనా అంటూ ప్రేమ, పెళ్లి విషయాలను కొట్టిపారేసింది!