Asianet News TeluguAsianet News Telugu

ప్రభాస్ నటనను ఇన్సల్ట్ చేస్తూ 'కల్కి' నటి పోస్ట్?

ఫస్టాఫ్ లో కొన్ని సీన్స్ ని ఎవాయిడ్ చేసి ఉంటే ఖచ్చితంగా రియల్ క్లాసిక్ అయ్యి ఉండేది. ప్రభాస్ కామెడీ ట్రై చేసారు. అది క్రింజీగా ఉంది. అది అక్కర్లేని కామెడీ. 

Did Kalki Actress Anna Ben Insult Prabhas? jsp
Author
First Published Jul 4, 2024, 9:03 AM IST

ప్రభాస్(Prabhas) రీసెంట్ గా  కల్కి 2898AD సినిమాతో  థియేటర్లో దిగిన సంగతి తెలిసిందే.   సలార్ తో హిట్ కొట్టిన ప్రభాస్  కల్కి సినిమాతో వచ్చి దుమ్ము రేపాడు. నాగ్ అశ్విన్(Nag Ashwin) దర్శకత్వంలో దాదాపు 600 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన  ఈ సినిమా కలెక్షన్స్ రికార్డ్ లు బ్రద్దలు కొడుతోంది.   గ్లింప్స్ తో హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమా ఉంటుందని ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకుంటున్నారు. అందుకు తగ్గట్లే అంతకు మించి అన్నట్లు విజువల్స్ ఉండటంలో ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే అదే సమయంలో కల్కి సినిమాపై కొంత డివైడ్ టాక్ కూడా రన్ అవుతోంది. అయినా దాని ఇంపాక్ట్ కలెక్షన్స్ మీద అయితే లేదు. 

 ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తోంది. కానీ తాజాగా ఈ సినిమాలో నటించిన మళయాళ నటి అన్నాబెన్ చేసారన్నట్లు ప్రభాస్ నటనపై కొన్ని కామెంట్స్ కు చెందిన స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అయితే ఆమె ఎక్కౌంట్ లో ఆ స్క్రీన్ షాట్ కు సంభందించిన  పోస్ట్ అయితే లేదు. దాంతో అది ఫేక్ స్క్రీన్ షాట్ అని కొందరు అంటూంటే మరికొందరు అదేమీ లేదు ఆమె ప్రభాస్ ఫ్యాన్స్ తాకిడికి  డిలీట్ చేసేసింది అంటున్నారు.  ఇంతకీ ఆ స్క్రీన్ షాట్   రివ్యూ లో  ఉన్న మేటర్ ఏంటంటే..

Did Kalki Actress Anna Ben Insult Prabhas? jsp

ఆమె కల్కి సినిమాపై వచ్చిన రివ్యూను షేర్ చేస్తూ కొంత మేటర్ ఆమె రాసుకొచ్చినట్లు  చేసినట్లు ఉంది. ఆ రివ్యూ   మేటర్ లో హైలెట్ గా ఫస్టాఫ్ లో కొన్ని సీన్స్ ని ఎవాయిడ్ చేసి ఉంటే ఖచ్చితంగా రియల్ క్లాసిక్ అయ్యి ఉండేది. ప్రభాస్ కామెడీ ట్రై చేసారు. అది క్రింజీగా ఉంది. అది అక్కర్లేని కామెడీ. అలాగే ఓ సాంగ్ సీక్వెన్స్ కూడా సినిమాలో ఫిట్ కాలేదు అంటూ రాసుకొచ్చింది. అది కొందరు నిజమే ప్రభాస్ లాంటి స్టార్ కామెడీ చేస్తూంటే ఇబ్బందిగా అనిపించింది. ఆమె రాసింది కరెక్ట్ అంటున్నారు. అయితే ఇప్పుడు అసలు ఆమె పేరు మీద ఎవరైనా క్రియేట్ చేసిన స్క్రీన్ షాట్ లేక నిజంగానే ఆమె పోస్ట్ పెట్టి డిలేట్ చేసిందా అనేది తెలియాలి. అయితే ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఆమెపై మండిపడుతున్నారనేది మాత్రం నిజం. ఎందుకంటే ఆ రివ్యూ ని షేర్ చేయటం అంటే అందులో చెప్పబడ్డవన్నీ ఆమె సపోర్ట్ చేసినట్లే కదా అనేది అభిమానులు వాదన. 
 
ఇక మలయాళం హీరోయిన్ అన్నా బెన్ ప్రభాస్ కల్కి సినిమాలో ఓ కీలక పాత్ర పోషించింది.  మలయాళంలో కుంబలంగి నైట్స్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి హిట్ కొట్టిన అన్నా బెన్ ఆ తర్వాత వరుసగా హెలెన్, సారా, కప్పేలా, కాపా.. ఇలా వరుస సినిమాలతో హిట్స్ కొట్టింది. ప్రస్తుతం మలయాళంలో వరుస సినిమాలు చేస్తుంది. ఇటీవలే తమిళ్ లో కూడా ఓ సినిమా ఒప్పుకుంది. ఈమెకు తెలుగులో కూడా కొంత ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు ప్రభాస్ కల్కి సినిమాలో కూడా ఓ పాత్ర చేయడంతో ఆమె అభిమానులు సంతోషిస్తున్నారు. అన్నా బెన్ తండ్రి బెన్నీ మలయాళ సినీ పరిశ్రమలో ప్రముఖ రచయిత.

ఇక కల్కి  మూవీ (ఆదివారంతో) రూ.500 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టినట్లు కల్కి ప్రొడక్షన్ హౌస్ వైజయంతి మూవీస్ అధికారికంగా ప్రకటించింది. కేవలం మూడు రోజుల్లోనే (శనివారం వరకు) రూ.415 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది.ఈ కలెక్షన్స్ ఇలాగే కొనసాగితే మరో వారం రోజుల్లో రూ.1000 కోట్ల మార్కును దాటేస్తుంది అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios