సినిమా ఇండస్ట్రీలో ప్రేమ, పెళ్లి, బ్రేకప్ లు చాలా కామన్ గా జరుగుతుంటాయి. ముఖ్యంగా బాలీవుడ్ లో ఇలాంటి కల్చర్ ఎక్కువగా కనిపిస్తుంటుంది. తాజాగా బాలీవుడ్ లో మరో జంట వివాహ బంధానికి గుడ్ బై చెప్పింది. నటి దియా మీర్జా తన భర్త నుండి విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.

ఈ విషయాన్ని ఆమె ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రకటిస్తూ అభిమానులను షాక్ కి గురి చేసింది. పదకొండు సంవత్సరాలు ఒకరితో ఒకరు జీవితాలను పంచుకొని ఇప్పుడు పరస్పరం  విడిపోవాలని నిర్ణయించుకున్నామని, కానీ ఎప్పటికీ స్నేహితుల్లాగే ఉంటామని, ఒకరినొకరం గౌరవించుకుంతామని అన్నారు.

మా ప్రయాణాలు విభిన్న మార్గాలను ఎంచుకున్నప్పటికీ ఇద్దరి మధ్య ఉన్న బంధాన్ని గౌరవిస్తూనే ఉంటామని, మమ్మల్ని అర్ధం చేసుకొని సహకరించినందుకు మా కుటుంబసభ్యులకు, స్నేహితులకు, మీడియా సన్నిహితులకు ధన్యవాదాలు అని చెప్పారు. ఈ సమయంలో తనకు ప్రైవసీ కల్పించాలని కోరారు.

ఇక నుండి ఈ విషయంపై తను ఎలాంటి కామెంట్ చేయాలనుకోవడం లేదని చెప్పింది. ఢిల్లీకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సాహిల్ సంఘాని చాలా కాలం ప్రేమించి 2014 అక్టోబర్ లో వివాహం చేసుకొంది దియా. ఢిల్లీలోని చత్తార్ పూర్ లో వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు.