Guppedantha Manasu: బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్  కొనసాగుతుంది. ఇక ఈరోజు మార్చి 14వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. 

ఈరోజు ఎపిసోడ్లో దేవయాని అందరూ కలిసి ఎక్కడికి వెళ్లారు అని టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలో తెలియక ఫణింద్ర పై సీరియస్ అవుతూ ఏమండీ నా మీకు కనపడుతోందా అనగా ఇప్పుడు ఏం జరిగింది దేవయాని అని ఫణింద్ర అనడంతో ఇంట్లో జగతి మహేంద్ర, వసుధార, రిషి ఆఖరికి ధరణి కూడా లేదు అని అంటుంది. అందరూ ఎక్కడికి వెళ్లారు అనడంతో అవును ఎక్కడికి వెళ్లారు అని అంటాడు ఫణింద్ర. ఇంతలోనే అక్కడికి జగతి,ధరణి, మహేంద్ర రిషి, వసు వాళ్ళు అందరూ రంగులు పూసుకుని రావడంతో అది చూసి దేవయాని ఏంటి నాన్న రిషి ఇది అని అడుగుతుంది. అప్పుడు వసు దేవయానిని హత్తుకొని మేడం మీకు కూడా హ్యాపీ హోలీ అనడంతో ఏంటిది అనగా హోలీ మేడం అని అంటుంది.

ఏంటి రిషి ఇది అనగా పెద్దమ్మ హోలీని సరదాగా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాము అని అంటాడు. హ్యాపీ కదా రిషి అనడంతో అవును పెద్దమ్మ అనగా నీ సంతోషమే నాకు ముఖ్యం కాదు నాన్న అని అంటుంది. అప్పుడు అందరూ సంతోష పడుతూ ఉంటారు. అప్పుడు పనింద్ర నన్ను మీ వదినను కూడా పిలవచ్చు కదా అనడంతో ఎక్కడో బస్తీ వాళ్ళతో హోలీ ఆడొస్తే మీరు అడగడం ఏంటండీ అని అంటుంది దేవయాని. పండగ అందరికీ ఒకటే కదా దేవయాని అనడంతో బాగానే చెప్పారు లేండి ఏంటి జగతి నువ్వైనా చెప్పేది లేదా అని అంటుంది దేవయాని. అప్పుడు పెద్దమ్మ డాన్స్ లు కూడా బాగా చేసాను తెలుసా అనడంతో ఇందులో డాన్సులు కూడా ఉన్నాయా అనడంతో అవును అత్తయ్య అంటూ ధరణి డాన్స్ చేసి చూపిస్తుంది.

వెంటనే దేవయాని కోపంతో ఏయ్ ఆపు అని అరుస్తుంది. నాన్న రిషి నీకు రంగులు అంటే పడవు వెళ్లి ఫ్రెష్ అయ్యిరాపో అనడంతో వెంటనే వసు మేడం మీరు స్వీట్స్ ఏమి చేయలేదా నేను మళ్ళీ వచ్చి చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అందరూ వెళ్ళిపోతారు. తరువాత రిషి, వసుతో మాట్లాడుతూ ఈ రంగులు కడిగితే పోతాయేమో కానీ ఆనందం ఇంకా కొన్నాళ్లు పోదు అని అంటాడు. ఇందుకు నీకు థాంక్స్ చెప్పాలి నీ వల్లే ఇదంతా జరిగింది అని చెప్తుండగా పక్కనే ఉంటూ దేవయాని అని వారి మాటలు విని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడు కూడా దేవయాని ఉండడంతో ఏంటి పెద్దమ్మ అక్కడ ఉన్నారు అనగా అదేం లేదు రిషి అని అబద్ధాలు చెబుతూ ఉంటుంది.

మరోవైపు జగతి మహేంద్ర లోపలికి వెళ్ళగా థ్యాంక్స్ జగతి అని అంటాడు మహేంద్ర. ఎందుకు అనడంతో వసుధార రిషి చాలాకాలం తర్వాత సంతోషంగా కనిపించారు అని అంటాడు. అప్పుడు జగతి ఇదంతా వసు వల్లే మహేంద్ర అని అంటుంది. అవును మహేంద్ర అక్కయ్య గొడవ చేస్తుంది అనుకున్నాను కానీ రిషి ని చూసి బలవంతంగా నవ్వు నవ్వింది అవును అని మహేంద్ర నవ్వుతూ ఉండగా ఆ మాటలు దేవయాని వింటూ ఉంటుంది. అప్పుడు వారిద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉండగా ఈ ఇంట్లో నేను తప్ప అందరూ సంతోషంగా ఉన్నారు అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత వసుధాన రిషి ఇద్దరు కాఫీ తాగుతూ ఉండగా హోలీ మరకలు ఇంకా పోలేదు సార్ అనడంతో ఉండడం బాగుంటుంది అని అంటాడు రిషి.

అప్పుడు పర్లేదు సార్ ఒకసారి చేతులు ఇలా ఇవ్వండి అని వసుధార చేతికి అంటిన కలర్ లను ఒక శుభ్రం చేస్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళిద్దరూ ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ ఉండగా ఇంతలోనే అక్కడికి దేవయాని వస్తుంది. మొత్తానికి ఈ హోలీ పండుగ సంతోషంగా గడిచింది కదా అనడంతో అవును పెద్దమ్మ అని అంటాడు రిషి. అప్పుడు దేవయాని నువ్వు సంతోషంగా ఉంటే చూసి నేను కూడా సంతోషపడేదాన్ని కదా రిషి నన్ను కూడా పిలుచుకొని వెళ్లి ఉంటే బాగుండేది కదా అని అంటుంది. మురికి వాడలో చేసుకునే దానికంటే ఇక్కడే చేసుకునే వాళ్ళం కదా అనడంతో కరెక్టే వసుధార నాకు ఎందుకు ఈ ఆలోచన రాలేదు అని అంటాడు రిషి. అప్పుడు వసు ఏం మాట్లాడాలో తెలియక ఇస్తూ ఉండగా తప్పు చేసాం వసుధార అంటాడు రిషి.

 నువ్వేం తప్పు చేయలేదు రిషి వసుధార అని మర్చిపోయింది అని అడ్డంగా ఇరికిస్తుంది దేవయాని. అప్పుడు రిషి ఇకపై గుర్తు పెట్టుకో ఏ సెలెబ్రేషన్స్ జరిగినా కూడా అందులో పెద్దమ్మ ఉండాలి అనగా సరే అని అంటుంది. ఆ తరువాత అందరు కలిసి భోజనం చేస్తూ ఉంటారు. అప్పుడు అందరూ కలిసి హోలీ పండుగ గురించి సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. మహేంద్ర మూడు జంటలు కలిసే సెల్ఫీలు దిగుదామా అనడంతో వెంటనే వసుధార మరి ధరణి మేడం ఆమె ఆనందం గురించి కూడా మనం ఆలోచించాలి కదా అని అంటుంది. ధరణి మేడం హస్బెండ్ ఉంటే బాగుండేది ఆయన పేరు ఏంటి మేడం అనడంతో శైలేంద్ర భూషణ్ అని అంటుంది జగతి.

 ఇవన్నీ నీకు అనవసరమైన విషయాలు అనడంతో వెంటనే రిషి ఆలోచించి అవును పెద్దమ్మ అన్నయ్యను ఇక్కడికి రప్పిద్దాము అని అంటాడు. అప్పుడు అందరూ కలిసి శైలేంద్ర ను పిలిపించవచ్చు కదా అని అనగా శైలేంద్ర రాడు అని అంటుంది దేవయాని. అలా అయితే ధరణిని అక్కడి నుంచి పంపిద్దాము అనడంతో వెంటనే దేవయానికి కోపంతో ధరణి కూరల్లో ఉప్పు కారం తగ్గించు ఆరోగ్యానికి అంత మంచిది కాదు అని అంటుంది. అప్పుడు ధరణి ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు అందరూ బాధపడుతూ ఉంటారు.