ఇళయరాజాగా ధనుష్.. మామూలుగా ఉండదు
ఇళయరాజా బయోపిక్ కు సన్నాహాలు జరుగుతున్నట్లు తమిళ సినీ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి. ఓ పెద్ద బ్యానర్ ఇప్పటికే ఇళయరాజాతో మాట్లాడారని అంటున్నారు.

చిన్న స్దాయి నుంచి జీవితం ప్రారంభించి పెద్ద స్టేజికి వెళ్లినవారి కథలు ఎప్పుడూ ఆసక్తికరమే స్పూర్తిదాయకమే. అలాంటివారిలో ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ఒకరు. ఆయన జీవితంలో ఎన్నో గొప్ప విషయాలు,గొప్ప రాగాలు,అనేక వివాదాలు ఉన్నాయి. ఎంతో స్పూర్తివంతమైన జీవితం ఆయనది అని ఆయన గురించి తెలుసున్న వాళ్లు చెప్తారు. అయితే వాటిని అన్నిటికి కలిపి స్క్రిప్టు రెడీ చేసి ఓ సినిమా తెరకెక్కనుందని సమాచారం. ఇళయరాజా బయోపిక్ కు సన్నాహాలు జరుగుతున్నట్లు తమిళ సినీ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి. ఓ పెద్ద బ్యానర్ ఇప్పటికే ఇళయరాజాతో మాట్లాడారని అంటున్నారు. అయితే ఇళయరాజా ఈ ప్రపోజల్ కు ఎంతవరకూ సముఖంగా ఉన్నారానేది తెలియాల్సి ఉంది.
ఇక ఈ చిత్రం పీరియడ్ కథాంశంతో తెరకెక్కనుంది. నాలుగు దశాబ్దాలకు పైగా సంగీత ప్రియులను అలరిస్తున్న ఇళయరాజా పుట్టక నుంచి ఆయన ప్రభంజనం గా ఎదిగిన తీరుని స్పష్టం చేస్తూ ఈ స్క్రిప్టు రాసారని తెలుస్తోంది. 1000 చిత్రాలకు పైగా సంగీతాన్ని అందించి అసాధారణ రికార్డును సాధించటం వెనక ఆయన కృషి, పట్టుదల ను హైలెట్ చేస్తూ స్పూర్తిమంతంగా ఈ సినిమాని తెరకెక్కించనున్నారు.
గతంలోనూ ఈ ప్రపోజల్ వచ్చిందని,ఇళయరాజా బయోపిక్ చిత్రం తెరకెక్కనున్నట్లు, దీనిని ఆయనే నిర్మించనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఆ తరువాత మళ్లీ ఇప్పుడు ఇన్నాళ్లకు ఆ వార్తలు మొదలయ్యాయి. అలాగే ఈ చిత్రంలో ఇళయరాజాగా ధనుష్ నటించడానికి సిద్ధం అవుతున్నట్లు టాక్. ఈవార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ చిత్రం 2024లో సెట్‌పైకి వెళ్లనుందని, 2025లో తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అధికారిక ప్రకటన వచ్చేదాకా ఈ ప్రాజెక్టుని గాసిప్ గా పరిగణించాల్సి ఉంటుంది.