తమిళంలో కన్నా తెలుగులోనే మంచి రెస్పాన్స్ వచ్చిందని చెప్పాలి. ఇలాగే ఇంకో నాలుగు రోజులు ఆడితే, కొన్నవాళ్ళు సేఫ్ అవుతారు. పండగ రోజు,శనివారం కలిసి వచ్చింది..
`తొలిప్రేమ`తో సాలిడ్ హిట్ సినిమాని అందించిన దర్శకుడు వెంకీ అట్లూరి ఆ తర్వాత `మిస్టర్ మజ్ను`, `రంగ్ దే` చిత్రాలతో మెప్పించలేకపోయాడు. అయితే ఈ సారి ఆయన ఓ సందేశాత్మక చిత్రంతో మన ముందుకు వచ్చాడు. అందుకు తోడుగా తమిళ హీరో ధనుష్ ని తెచ్చుకున్నాడు. పెద్ద బ్యానర్...నేటి విద్యా వ్యవస్ద పై సినిమా కావటం, ప్రీ పెయిడ్ ప్రీమియర్ షోలు సినిమాకు హైప్ క్రియేట్ చేసాయి. ఇక దర్శకుడు వెంకీ అట్లూరి తీసిన ఈ సినిమాకి ఇటు తెలుగులోనూ, అటు తమిళ్ లోనూ సోసో గా ఉందంటూ రివ్యూస్ వచ్చాయి. టాక్ కూడా గొప్పగా లేదు. అయితే, తెలుగునాట ఓపెనింగ్ మాత్రం టాక్ కి మించి కలెక్షన్లు వచ్చాయని ట్రేడ్ అంటోంది.
హీరో ధనుష్ కి డబ్బింగ్ సినిమాలు రీసెంట్ గా వర్కవుట్ కాకపోయినా తెలుగు మార్కెట్ లో మంచి మార్కెట్ ఉందని అర్థమైంది. ఆయన నటించిన ‘సార్’ సినిమాకి మంచి ఓపెనింగ్ వచ్చింది. ధనుష్ గతంలో నటించిన అనేక డబ్బింగ్ చిత్రాలతో పోల్చితే ఈసారి తెలుగులో వచ్చిన కలెక్షన్లు ఎక్కువగా చెప్తున్నారు.
మొదట రోజు ఈ చిత్రం మొదటి రోజు తమిళ,తెలుగు వెర్షన్స్ కలిపి ₹ 9.70 (తమిళం: 5.65 Cr ; తెలుగు: 4.05 Cr] కోట్లు నెట్ వచ్చింది. రెండో రోజు నెట్ ₹ 11.00 కోట్లు దాకా వచ్చి ఉండచ్చు అని చెప్తున్నారు. తమిళంలో కన్నా తెలుగులోనే మంచి రెస్పాన్స్ వచ్చిందని చెప్పాలి. ఇలాగే ఇంకో నాలుగు రోజులు ఆడితే, కొన్నవాళ్ళు సేఫ్ అవుతారు. పండగ రోజు,శనివారం కలిసి వచ్చింది..ఆదివారం ఈ రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయి...సోమవారం డ్రాప్ లేకుండా ఉంటుందా అనే విషయాలపై బ్రేక్ ఈవెన్ ఆధారపడి ఉంటుంది.
ఇక ఈ సినిమా రిజల్ట్ పై సార్ ప్రొడ్యూసర్స్ తో పాటు శేఖర్ కమ్ముల, ఆయన నిర్మాతలు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా లాభాల్లోకి వస్తే ధనుష్ నెక్స్ట్ మూవీకి బిజినెస్ సర్కిల్స్ లో క్రేజ్ ఉంటుంది. దర్శకుడు శేఖర్ కమ్ములతో సినిమా చేసేందుకు ధనుష్ ఇప్పటికే కమిటయ్యాడు. ఈ సినిమా త్వరలోనే మొదలవుతుంది. ప్రస్తుతం శేఖర్ కమ్ముల ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు.
