Asianet News TeluguAsianet News Telugu

Dhanush : ఐశ్వర్య కోసం పాట పాడిన ధనూష్.! వీడియో షేర్ చేస్తున్న ఫ్యాన్స్..

 18 ఏండ్ల వివాహ బంధానికి తెర దించుతూ స్టార్ హీరో ధనూష్ - ఐశ్వర్య నిన్న ప్రకటన చేసిన విషయం తెలిసిందే.  అయితే వీరిద్దరూ ఇష్టపడి పెళ్లి చేసుకున్న విషయం అందిరికీ విధితమే. అప్పట్లో ధనూష్ ఐశ్వర్యను ఇంప్రెస్ చేసేందుకు పాడిన ఓ పాట ఇప్పుడు సోషల్ మీడియా చక్కర్లు కోడుతోంది. ఫ్యాన్స్ కూడా తెగ షేర్ చేస్తున్నారు. 

Dhanush Sang a song for Aishwarya..!
Author
Hyderabad, First Published Jan 18, 2022, 12:21 PM IST

వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతున్న తమిళ హీరో ధనూష్ డివోర్స్ తీసుకొంటూ తన అభిమానులకు భారీగానే షాక్ ఇచ్చారు. అయితే ధనూష్ - ఐశ్వర్య వీడిపోయారనే బాధలో పలువురు అభిమానులు వారి పాత జ్ఞపకాలను  నెమరు వేసుకుంటున్నారు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. షేర్ చేస్తున్నారు. 

అయితే, గతంలో ఓ పార్టీలో ధనూష్ తన మాజీ భార్య ఐశ్వర్య కోసం పాడిన  ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ప్రేమకు చిరునామాగా నిలిచిన వీరిద్దరూ గతంలో ఎంత అన్యోన్యంగా ఉండే వారో చూపుతూ కొందరు ధనూష్, ఐశ్వర్య అభిమానులు సంబంధిత వీడియోలను షేర్ చేస్తున్నారు. ఈ వీడియోలో ధనూష్ - ఐశ్వర్య కోసం పాడిన పాట ఎంతో అద్భుతంగా ఉందని తెలుపుతున్నారు. 

ధనూష్, ఐశ్వర్య డివోర్స్ తీసుకుంటున్నట్టు ప్రకటించడం నిజంగా తమకు గుండె పగిలిపోయే వార్తనేనని అభిమానులు అంటున్నారు. ఏదేమైనా ఇద్దరు కొంచెం సాధారణ స్థితిలోకి రావాలని, మున్ముందు ధైర్యంగా ఉండాలని ట్విట్లు చేస్తున్నారు. 

ఇప్పటికే డివోర్స్ వార్త విన్న అభిమానులు, బంధుమిత్రులు,స్నేహితులు,  పలువురు సినీ ప్రముఖులు నమ్మలేకపోతున్నారు. ఇన్ని రోజులు వీరిద్దరూ ఎంతో సంతోషంగా ఉండటం చూసి ఆనందం వ్యక్తం చేశామంటున్నారు. కానీ ఉన్నట్టుండి పిడుగులాంటి వార్త చెప్తారని ఊహించలేదంటూ ఫీల్ అవుతున్నారు. 

 

ధ‌నుష్‌-ఐశ్వ‌ర్య‌లు 2004లో పెళ్లి చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.  అయితే ఐశ్వర్య రజనీ కాంత్ 2013లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వీరి ప్రేమ.. పెళ్లి గురించి చెప్పిన విషయం తెలిసిందే. ఆ  మాటలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తమ పెళ్లి ఎలా జరిగిందనే  దానిపై చాలా క్లారిటీగా వివరణ ఇచ్చారు ఐశ్వర్య రజనీ కాంత్.

మూడేండ్ల కింద ప్రముఖ తెలుగు పత్రిక మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లోనూ ధనూష్ తమ ప్రేమ వివాహాం గురించి చెప్పారు. ఐశ్వర్యనే తనకు మొదట దగ్గరైంది కాదల్ కొండెన్(Kadhal Konden)సినిమా టైమ్ లో ఐశ్వర్య తనకో బొకే కూడా అందించినట్టు చెప్పారు. ఆ తర్వాతి ఆరు నెలల్లో వీరి పరిచయం కాస్త పరిణయం వరకూ వచ్చింది. ఇలాంటి విషయాలన్నీ ప్రస్తుతం ఫ్యాన్స్ తెలుసుకుంటూ ఉన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios