దాదాపు 11ఏళ్ల విరామం తర్వాత ధనుష్ - సెల్వ రాఘవన్ కాంబినేషనన్‌లో రూపుదిద్దుకున్న సినిమా ఇది. దీనికి ఈ సోదరులిద్దరూ సంయుక్తంగా కథ అందించారు. ఇందులో ధనుష్ ద్విపాత్రాభినయం చేశారు.
ఇలాంటి సినిమాలే చేస్తాడు..ఇలాంటి కథలే చేస్తాడు అనే ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌కు కట్టుబడని హీరో ధనుష్. జయాపజయాలతో సంబంధం లేకుండా వైవిధ్యభరితమైన కథలతో ప్రయోగాలు చేస్తుంటారు. ఓ నటుడిగా ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు కొత్త అనుభూతి పంచుతుంటారు. ఇదే ఆయన్ని తమిళ్‌తో పాటు తెలుగు వారికీ దగ్గర చేస్తూ వచ్చింది. ఇప్పుడాయన ‘నేనే వస్తున్నా’ అంటూ బాక్సాఫీస్ ముందుకు దూసుకొచ్చారు. ధనుష్ సోదరుడు సెల్వ రాఘవన్ తెరకెక్కించిన చిత్రమిది. దీని విషయంలో చాలా ప్రత్యేకతలే ఉన్నాయి.
దాదాపు 11ఏళ్ల విరామం తర్వాత ధనుష్ - సెల్వ రాఘవన్ కాంబినేషనన్‌లో రూపుదిద్దుకున్న సినిమా ఇది. దీనికి ఈ సోదరులిద్దరూ సంయుక్తంగా కథ అందించారు. ఇందులో ధనుష్ ద్విపాత్రాభినయం చేశారు. ఇలా ఇన్ని ప్రత్యేకతలతో రిలీజ్ కు ముందు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా తెలుగు వారికి పెద్దగా ఎక్కలేదనే చెప్పాలి. అయితే ధనుష్ అంటే అబిమానం ఉన్న చాలా మంది ఈ చిత్రం చూడాలని ఆశపడి ఓటిటి కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా ఓటిటి రిలీజ్ కు రెడీ అయ్యింది.
అక్టోబర్ 23న ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. అమేజాన్ ప్రైమ్ వీడియోలో ధనుష్ నేనే వస్తున్నా స్ట్రీమింగ్ అవనుంది. మేకర్స్ ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసినా సరే అమేజాన్ ప్రైమ్ వీడియో నుంచి మాత్రం డిజిటల్ రిలీజ్ అప్డేట్ రాలేదు. ఇక దీపావళికి సినిమాల హంగామా బాగానే ఉండేలా ఉంది. విశ్వక్ సేన్ ఓరి దేవుడా.. మంచు విష్ణు జిన్నా సినిమాలతో పాటుగా జాతిరత్నాలు డైరక్టర్ అనుదీప్ కెవి డైరక్షన్ లో తమిళ హీరో శివ కార్తికేయన్ నటించిన బైలింగ్వల్ మూవీ ప్రిన్స్ కూడా అక్టోబర్ 21 ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మూడు సినిమాలు డిఫరెంట్ జానర్ లు అవడంతో ప్రేక్షకులు ఈ సినిమాల మీద ఆసక్తిగా ఉన్నారు. వీరితో పాటుగా డిజిటల్ రేసులో ఈ సినిమా రిలీజ్ అవుతోంది.
కథేంటంటే: ప్రభు (ధనుష్)ది చాలా సంతోషమైన కుటుంబం. తనని ఎంతో చక్కగా అర్థం చేసుకున్న భార్య.. దేవత లాంటి కూతురు.. ఈ ఇద్దరే ఆయన ప్రపంచం. సాఫీగా.. సంతోషంగా సాగిపోతున్న ఈ కుటుంబాన్ని ఓ దెయ్యం కలవరపాటుకు గురిచేస్తుంది. దాని పేరు సోనూ. అది ప్రభు కూతుర్ని ఆవహించి.. ఆమెను అశక్తురాల్ని చేయడం మొదలుపెడుతుంది. తను ఆ పాపను వీడాలంటే ఖదీర్ (ధనుష్)ను అంతమొందించాలని షరతు విధిస్తుంది. ఇంతకీ ఆ ఖదీర్ మరెవరో కాదు ప్రభు కవల సోదరుడే. మరి వీళ్లిద్దరూ ఎందుకు విడిపోయారు? అసలు ఖదీర్ గతమేంటి? ఆ దెయ్యానికి ఇతనికీ ఉన్న సంబంధం ఏంటి? తన కుమార్తెను రక్షించుకోవడం కోసం ప్రభు తన సోదరుడ్ని చంపాడా? లేదా? అన్నది తెరపై చూసి తెలుసుకోవాలి.
