హీరో ధనుష్ నటనలో మాత్రమే కూడా రియల్ లైఫ్ వ్యవహార శైలి కూడా అందరికంటే విభిన్నంగా ఉంటుంది. అందుకు ధనుష్ పట్ల చాలా మంది అభిమానులు ఆకర్షితులు అవుతుంటారు. ధనుష్.. ఐశ్వర్య రజనీకాంత్ ని 2004లో వివాహం చేసుకుని సూపర్ స్టార్ కి అల్లుడయ్యారు.
హీరో ధనుష్ నటనలో మాత్రమే కూడా రియల్ లైఫ్ వ్యవహార శైలి కూడా అందరికంటే విభిన్నంగా ఉంటుంది. అందుకు ధనుష్ పట్ల చాలా మంది అభిమానులు ఆకర్షితులు అవుతుంటారు. ధనుష్.. ఐశ్వర్య రజనీకాంత్ ని 2004లో వివాహం చేసుకుని సూపర్ స్టార్ కి అల్లుడయ్యారు. అయితే రజనీకి ధనుష్ అల్లుడి కంటే ముందుగా ఆయన అభిమాని.
ఎన్నో సందర్భాల్లో ధనుష్.. రజనీ పై తన అభిమానం చాటుకున్నారు. కానీ ఊహించని విధంగా గత ఏడాది ధనుష్, ఐశ్వర్య 18 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలుకుతూ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే బంధం బంధుత్వం ఎలా ఉన్నా రజనీకాంత్ పై తన అభిమానం శాశ్వతం అని ధనుష్ నిరూపించారు.
సూపర్ స్టార్ రజనీ నటించిన జైలర్ చిత్రం రేపటి నుంచి అంటే ఆగష్టు 10 నుంచి థియేటర్స్ లో సందడి చేయబోతున్న సంగతి తెలిసిందే. దీనితో తమిళనాడు వ్యాప్తంగా ఫ్యాన్స్ లో కోలాహలం నెలకొంది. ధనుష్ తాజాగా రాజనీపై తన అభిమానం ప్రదర్శిస్తూ 'ఇట్స్ జైలర్ వీక్' అని ట్వీట్ చేశారు. జైలర్ చిత్రంలో కోసం ధనుష్ ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడో ఈ ట్వీట్ తో అర్థం అవుతోంది.
ధనుష్ తన మాజీ మామపై అభిమానం ప్రదర్శిస్తున్నాడు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ట్వీట్ వైరల్ గా మారింది. గత ఏడాది ధనుష్, ఐశ్వర్య విభేదాల కారణంగా విడిపోయారు. అయితే కొన్ని రోజుల క్రితం ధనుష్, ఐశ్వర్య విడాకులు రద్దు చేసుకుబోతున్నట్లు కూడా ప్రచారం జరిగింది. అయితే ఇందులో ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ధనుష్, ఐశ్వర్య జంటకి ఇద్దరు కుమారులు సంతానం.
