Asianet News TeluguAsianet News Telugu

#Captainmiller మాకే దిక్కులేదు - మళ్లీ నువ్వొకడవా?

తెలుగు సినిమాలతో పాటు మేము సైతం అంటూ సంక్రాంతి రిలీజ్‌కు రెడీ అయిపోయింది.. డబ్బింగ్‌ మూవీస్‌ కెప్టెన్ మిల్లర్. 

Dhanush Captain Miller Joins Sankranti Race in Telugu States? jsp
Author
First Published Jan 8, 2024, 9:05 AM IST | Last Updated Jan 8, 2024, 9:05 AM IST


 సంక్రాంతి సినిమాల హడావిడిలో తమిళ డబ్బింగ్ సినిమాలు దిగితే సీన్ ఎలా ఉంటుంది..వాటికీ థియేటర్స్ దొరుకుతాయా. ? ధనుష్ కొత్త చిత్రం కెప్టెన్ మిల్లర్ సైతం నేను సంక్రాంతికి వచ్చే అవకాసం ఉంది అంటోంది ట్రేడ్ .  ఈ చిత్రం నుంచి తాజాగా థియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది. అయితే తెలుగు వెర్షన్ మాత్రం రిలీజ్ చేయలేదు.  కెప్టెన్ మిల్లర్ చిత్రం జనవరి 12న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజవుతోంది. ఈ చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, తెలుగు హీరో సందీప్ కిషన్ కూడా నటిస్తున్నారు. ట్రైలర్ చూస్తుంటే, ఇది బ్రిటీష్ కాలం నాటి ఇతివృత్తంతో పీరియడ్ గా  తెరకెక్కుతున్న చిత్రం అని క్లారిటీ వచ్చేసింది. యాక్షన్ ఎపిసోడ్స్ తో  సినిమా హిట్టవుతుందని నమ్మకం కలిగింది. 

ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారు.  ప్రస్తుతం సంక్రాంతికి టాలీవుడ్ లో గట్టి పోటీ ఉంది. దాంతో ధనుష్ సినిమా తెలుగు రిలీజ్ ను ఆపేసినట్టు వార్తలు వచ్చాయి.అయితే తమిళ,తెలుగులో ఒకేసారి రిలీజ్ అయితేనే బెస్ట్ అని ధనుష్ భావిస్తున్నారట.    తెలుగులోనూ ధనుష్ కు మంచి మార్కెట్ ఉండటంతో సంక్రాంతికి వస్తే బెస్ట్ అని భావిస్తున్నారు.  థియేటర్స్ పూర్తిగా ఇవ్వకపోయినా కొన్ని షోలు ఇచ్చినా చాలు అన్నట్లు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. తమ కంటెంట్ మీద నమ్మకంతో తెలుగు రిలీజ్ కు ప్లాన్ చేస్తే బాగుంటుందనేది వారి ఆలోచన. షేర్ పద్దతిలో తెలుగులో డిస్ట్రిబ్యూటర్స్ కు ఇచ్చేలా మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. అయితే అఫీషియల్ సమాచారం ఏమీ లేదు. 

 ఇక ఈ సినిమా కథ బ్రిటీష్ కాలంలో జరుగుతుంది. బ్రిటీష్ వారికి, గిరిజన వర్గానికి చెందిన యువకుడికి మధ్య జరిగే యుద్ధమే ఈ సినిమా కథ అని ట్రైలర్ చూస్తుంటే అర్ధమవుతుంది. బ్రిటిష్ అధికారులు గిరిజన తండా భూమిని స్వాధీనం చేసుకుని అక్కడ మైనింగ్ ప్రారంభించడం. హింసాత్మకంగా వారిని ఆ ప్రదేశం నుండి బహిష్కరించడానికి ప్రయత్నించడం చూపించారు. అప్పుడు అదే వర్గానికి చెందిన ఓ యువకుడు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడతాడు. ఇదీ ‘కెప్టెన్ మిల్లర్’ సినిమా కథ అని తెలుస్తోంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios