ధనుష్‌ `కెప్టెన్ మిల్లర్‌` మూవీ ఐదు రోజుల్లో 75కోట్లకి రీచ్‌ అయ్యింది. శుక్రవారం విడుదలైన ఈ మూవీకి మొదట మిశ్రమ స్పందన లభించింది. పెద్దగా ఆదరణ దక్కలేదు. 

ధనుష్‌ ఇటీవల `సార్‌` మూవీతో తెలుగు ఆడియెన్స్ కి బాగా దగ్గరయ్యారు. ఆయన సినిమాలు ఇటీవల చాలా వరకు తెలుగులో కూడా విడుదలవుతున్నాయి. దీంతో ధనుష్‌ సినిమాలు ఇక్కడ కూడాబాగానే ఆదరణ పొందుతున్నాయి. ఆయన ఈ సంక్రాంతికి `కెప్టెన్‌ మిల్లర్‌` చిత్రంతో వచ్చారు. తెలుగులో చాలా సినిమాలు ఉన్న నేపథ్యంలో ఇది కేవలం తమిళంలోనే విడుదలైంది. కానీ అక్కడ మంచి కలెక్షన్లని సాధిస్తుంది. 

ఈ మూవీ ఐదు రోజుల్లో 75కోట్లకి రీచ్‌ అయ్యింది. శుక్రవారం విడుదలైన ఈ మూవీకి మొదట మిశ్రమ స్పందన లభించింది. పెద్దగా ఆదరణ దక్కలేదు. కేవలం తొలి రోజు 16కోట్ల గ్రాస్‌ సాధించింది. రెండో 14కోట్లు, మూడో రోజు 15కోట్లు, నాల్గో రోజు 13కోట్లు, ఐదోరోజు 12కోట్లు వచ్చాయి. కలెక్షన్లు స్టడీగా కొనసాగుతున్నాయి. నెమ్మదిగా సినిమా ఆడియెన్స్ కి ఎక్కుతుంది. దాన్ని ఆదరిస్తున్నారు. దీంతో మొత్తంగా ఈ మూవీ ఐడు రోజుల్లో సుమారు 72కోట్లు సాధించింది. వంద కోట్ల దిశగా వెళ్తుంది. అయితే నేటి నుంచే దీనికి అసలు పరీక్ష ఎదురు కాబోతుంది. 

ఈ సినిమాని సుమారు 60కోట్ల బడ్జెట్‌తో రూపొందించారు. 30కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ జరిగింది. ఈ లెక్కన ఇప్పటికే ఈ మూవీ బ్రేక్‌ ఈవెన్‌కి చేరుకుంది. ఆల్రెడీ లాభాల్లోకి వెళ్లింది. మొత్తంగా హిట్‌ ఖాతాలో పడింది. ఇక ధనుష్‌ హీరోగా నటించిన ఈ చిత్రంలో శివ రాజ్‌ కుమార్‌ కీలక పాత్రలో నటించారు. ప్రియాంక అరుల్‌ మోహన్‌ హీరోయిన్‌గా చేసింది. సందీప్‌ కిషన్‌ సైతం కీలక పాత్రలో మెరిశారు. అరుణ్‌ మాతేశ్వర్‌ దర్శకత్వం వహించారు. 

ఇదిలా ఉంటే సంక్రాంతికి చాలా సినిమాలు విడుదలైన నేపథ్యంలో తెలుగులో ఈ మూవీ విడుదల కాలేదు. రిపబ్లిక్‌ డే సందర్భంగా జనవరి 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా తెలుగు ట్రైలర్‌ ని విడుదల చేశారు. ఇది ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఈ మూవీ ఎపిక్‌ యాక్షన్‌ అడ్వెంచరస్‌ ఫిల్మ్ గా తెరకెక్కించారు. 1930లో బ్రిటీష్‌ సైన్యాన్ని ఎదుర్కొని స్వాతంత్ర్యం కోసంపోరాటం చేసిన విప్లవ నాయకుడిగా ధనుష్‌ నటించారు. ఆయనకు తమ్ముడి పాత్రలో నటించారు. తెలుగు ట్రైలర్‌ ఆకట్టుకుని సినిమాపై అంచనాలను పెంచుతుంది. 

మ తెలుగులో ఎలాంటి ఫలితం రాబట్టుకుంటుందో తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో నాగార్జున కీలకపాత్రలో నటిస్తున్నారు. నేడు ఈ మూవీ షూటింగ్‌ ప్రారంభమైంది. రేపు దీన్నుంచి సర్‌ప్రైజ్‌ రానుంది.