తన అసిస్టెంట్ కు సర్ ప్రైజ్ ఇచ్చిన ధనుష్, బిజీ షెడ్యూల్ లో కూడా పెళ్లికి వెళ్లిన స్టార్ హీరో

ఫిల్మ్స్ స్టార్స్ లో చాలా తక్కువ మంది ఉంటారు.. తమ అసిస్టెంట్ల పెళ్లిళ్లకు.. పేరంటాలకు వెళ్లి విష్ చేసేవారు. తన దగ్గర పనిచేసేవారి ముఖంలో ఆనందం చూసేవారు వారి రేర్ గా ఉంటారు. అలాంటి వారిలో ధనుష్ కూడా ఒకరు.  

Dhanush Attends His Assistant Marriage In Chennai JMS

ఫిల్మ్స్ స్టార్స్ లో చాలా తక్కువ మంది ఉంటారు.. తమ అసిస్టెంట్ల పెళ్లిళ్లకు.. పేరంటాలకు వెళ్లి విష్ చేసేవారు. తన దగ్గర పనిచేసేవారి ముఖంలో ఆనందం చూసేవారు వారి రేర్ గా ఉంటారు. అలాంటి వారిలో ధనుష్ కూడా ఒకరు.  

నమ్మకంగా పనిచస్తే చాలు మన సెలబ్రిటీలు వాళ్ళ దగ్గర పనిచేసేవారిని సొంత ఫ్యామిలీ మెంబర్స్ లాగానే ట్రీట్ చేస్తుంటారు. ఇంట్లో స్వతంత్రం గా నమ్మకంగా ఉంటారు. అంతే కాదు పనివారి ఇంట్లో ఎటువంటి పార్టీలు ఫంక్షన్లు జరిగినా..  కచ్చితంగా హాజరవుతారు. వారికి ఏమన్నా సహాయం కావాలన్నా చేస్తారు. ఈమధ్య కాలంలో ఇలా సెలబ్రిటీలు తమ దగ్గర పనిచేసేవారి ఇళ్లకు పార్టీలకు ఫంక్షన్స్ కు వెళ్లడం సహజంగా చూస్తూనే ఉన్నాం. తాజాగా తమిళ స్టార్ హీరో ధనుష్ తన అసిస్టెంట్ పెళ్లికి వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది. 

తమిళ స్టార్ హీరో.. ధనుష్ దగ్గర ఆనంద్ అనే వ్యక్తి  గత కొన్నాళ్లుగా అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు. ఆనంద్ వివాహం నిన్న చెన్నైలో జరిగింది. ఈ వివాహానికి  ధనుష్ వెళ్లి తన అసిస్టెంట్ ను ఆశీర్వదించాడు. ధనుష్ రావడం ఆనంద్ కు సర్ ప్రైజింగ్ గా అనిపించింది.  ప్రస్తుతం తన 50వ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు ధనుష్.. అయినా సరే  షూటింగ్ అవ్వగానే ధనుష్ తన అసిస్టెంట్ పెళ్ళికి వచ్చి కొత్త దంపతులని ఆశీర్వదించాడు. దీంతో ఈ ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. 

 

అంతే కాదు తన అసిస్టెంట్ పెళ్ళి కానుకగా సర్ ప్రైజింగ్ అమౌంట్ ను ధనుష్ అందించినటట్టుతెలుస్తోంది. అయితే అంతటిస్టార్ హీరో.. ఇంత చిన్న ఉద్యోగి ఇంట్లో పెళ్ళికి రావడంతో అంతా ధనుష్ ని  అభినందిస్తున్నారు.ఇక ఈ పెళ్ళికి ధనుష్ కొత్త లుక్ లో వచ్చాడు. మొన్నటి దాకా ఫుల్ గడ్డం, జుట్టుతో తిరిగిన ధనుష్ ఇప్పుడు క్లీన్ షేవ్, మీసాలతో కనిపించాడు. దీంతో ఈ లుక్ వైరల్ గా మారింది. ధనుష్ 50వ సినిమాలో లుక్ ఇదేనేమో అని అభిమానులు భావిస్తున్నారు. ధనుష్ 50 వ సినిమా ధనుష్ సొంత దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios