సూపర్ స్టార్ రజినీకాంత్ అల్లుడిగా కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న కథానాయకుడు ధనుష్. నటుడిగా ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న ద్గనుష్ ఎక్కడికెళ్లినా ఆడియెన్స్ ని మెప్పించగలడని చాలా సార్లు ఋజువయ్యింది. 

టాలీవుడ్ ఫ్యాన్స్ కి కూడా బాగా దగ్గరైన ధనుష్ గతంలో బాలీవుడ్ లో 'రాంఝాన’ సినిమా చేసి బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. 2013లో వచ్చిన ఆ సినిమాకు ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించాడు. రాంఝాన సినిమా దాదాపు 140 కోట్ల కలెక్షన్స్ తో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. అయితే అంత మంచి మార్కెట్ సెట్టయినప్పటికీ ధనుష్ ఇంతవరకు బాలీవుడ్ లో మరో సినిమా చేయలేదు. 

అందుకు కారణం ఏమిటని అడిగితే సరైన కథ తగల్లేదని ధనుష్ చెబుతున్నాడు. అయితే ఇప్పుడు మాత్రం ఒక కథ తనకు కరెక్ట్ గా సెట్టయిందని త్వరలోనే బాలీవుడ్ ఆడియెన్స్ ని మరో సినిమాతో పలకరించనున్నట్లు చెప్పాడు. ఆ బాలీవుడ్ సినిమాకు కూడా ఆనంద్ ఎల్ రాయ్ డైరెక్ట్ చేయనున్నట్లు ధనుష్ వివరణ ఇచ్చాడు. ధనుష్ నటించిన 'ది ఎక్ట్రార్డినరీ జర్నీ అఫ్ ది ఫకీర్” అనే ఇంగ్లీష్ సినిమా ప్రమోషన్స్ లో ఈ విషయాన్నీ తెలిపాడు.