కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రయోగాలకు మరో అర్ధమని చెప్పవచ్చు. నటుడిగా ఎన్నో అవార్డులను సొంతం చేసుకొని వెండితెరపై తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న ధనుష్ ఇప్పుడు ఒక బ్లైండ్ కథను టార్గెట్ చేశాడు. కంప్లీట్ యాక్టర్ గా ధనుష్ ని చూసి చాలా కాలమవుతోంది. ఇటీవల చేసిన ప్రయోగాలు చాలా వరకు క్లిక్కవ్వలేదు.

ఇప్పుడు ఎలాగైనా నటుడిగా స్థాయిని పెంచే సినిమాను చేయాలనీ ఆశపడుతున్నాడు. బాలీవుడ్ లో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన అంధాదు కథను రీమేక్ చేయాలనీ ధనుష్ టార్గెట్ గా పెట్టుకున్నాడు. 2018లో వచ్చిన అంధాదున్ 400కోట్లకు పైగా కలెక్ట్ చేసి రికార్డ్ సృష్టించింది. ఆయుష్మాన్ ఖురానా కళ్లు లేనివాడిగా నటించి మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు.  ఆ సినిమా నచ్చడంతో ధనుష్ బ్లైండ్ రీమేక్ పై ద్రుష్టి పెట్టినట్లు చెప్పాడు.    

ఇటీవల కాలంలో నేను ఎక్కువగా రీమేక్ చేయలేదు. ఇప్పుడు అంధాదు చేయాలనీ అనుకుంటున్నా. త్వరలోనే సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్తానని ధనుష్ వివరణ ఇచ్చాడు. గత ఏడాది మారి 2 సినిమాతో వచ్చిన ధనుష్ పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయారు. ప్రస్తుతం ధనుష్ రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అలాగే ఈ స్టార్ హీరో మొదటిసారి నటించిన హాలీవుడ్ మూవీ 'ది ఎక్ట్రార్డినరీ జర్నీ అఫ్ ది ఫకీర్” త్వరలో రిలీజ్ కానుంది.