Asianet News TeluguAsianet News Telugu

కలెక్షన్స్ లో దుమ్ములేపుతున్న మాస్ మహారాజా.. ‘ధమాకా’ మూడు రోజుల కలెక్షన్స్.. ఎన్ని కోట్లు అంటే?

మాస్ మహారాజా రవితేజ - శ్రీలీలా జంటగా నటించిన తాజా చిత్రం ‘ధమాకా’ (Dhamaka). థియేటర్లలో సందడి చేస్తున్న ఈమూవీ బాక్సాఫీస్ వద్ద కూడా కాసుల వర్షం కురిపిస్తోంది. మూడు రోజుల్లో ఎంత వసూల్ చేసిందో తాజాగా మేకర్స్ అప్డేట్ అందించారు. 
 

Dhamaka Movie Three days Collections!
Author
First Published Dec 26, 2022, 2:32 PM IST

‘ధమాకా’తో  మాస్ మహరాజ్ రవితేజ ( Raviteja) మరో హిట్ అందుకున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న రవితేజ ‘క్రాక్’ తర్వాత అలాంటి హిట్ ను సొంతం చేసుకున్నారు. రవితేజ - శ్రీలీలా జంటగా నటించిన ఈ యాక్షన్ ఫిల్మ్ ను దర్శకుడు త్రినాధరావు నక్కిన డైరెక్ట్ చేశారు. ఈ నెల 23లో థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. తొలిరోజే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. మాస్ మహారాజ ఫ్యాన్స్ కు ఈ చిత్రం ట్రీట్ అనే చెప్పాలి. టాక్ లోనే కాకుండా కలెక్షన్స్ లోనూ సినిమా దుమ్ములేపుతోంది.

తొలిరోజే సాలిడ్ ఓపెనింగ్స్ ను దక్కించుకుంది. దాదాపు రూ.10 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఈ రెండో రోజు చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.19 కోట్ల గ్రాస్ ను వసూల్ చేసింది. తాజాగా మూడో రోజు కలెక్షన్ల వివరాలను కూడా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రపంచ వ్యాప్తంగా మూడురోజుల్లో రూ.32 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. రోజురోజుకు చిత్రం రెట్టింపు స్థాయిలో కలెక్షన్లను రాబడుతూ మాస్ ర్యాంపేజ్ ను చూపిస్తోంది. మరోవైపు ‘ధమాకా’ చిత్రం రవితేజ ‘క్రాక్’ కంటే దూకుడుగా కలెక్షన్లు రాబడుతూ మాసీవ్ బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది. 
 
చిత్రంలో వింటేజ్ రవితేజను చూపించడం, మాస్ అండ్ ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ అందిందనే చెప్పాలి. శ్రీలీలా సైతం దుమ్ములేపింది. కథ, యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకోవడంతో సినిమా లాంగ్ రన్ తో దూసుకుపోతోంది. ఇక ఈ చిత్రంలో రవితేజ డుయేల్ రోల్ లో నటిస్తుంచారు. తనికెళ్ల భరణి, రావు రమేశ్, అలీ, హైపర్ ఆది కీలక పాత్రల్లో నటించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios