Asianet News TeluguAsianet News Telugu

Dhamaka Collections: రవితేజకి `ధమాకా` బూస్ట్.. ఫస్ట్ డే కలెక్షన్లు ఎంతొచ్చాయంటే?

మాస్‌ మహారాజా రవితేజ నటించిన `ధమాకా` చిత్రం శుక్రవారం విడుదలైన విజయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ తొలి రోజు కలెక్షన్లలో సత్తాని చాటింది. మంచి ఓపెనింగ్స్ ని రాబట్టింది.

dhamaka movie first day collections raviteja bounce back
Author
First Published Dec 24, 2022, 2:25 PM IST

మాస్‌ మహారాజా రవితేజ(Raviteja) హీరోగా నటించిన `ధమాకా`(Dhamaka) చిత్రం బాక్సాఫీసు వద్ద తన సత్తాని చాటుతుంది. శ్రీలీలా కథానాయికగా నటించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే. మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ రూపొందిన ఈ సినిమా భారీగా తెలుగు రాష్ట్రాల్లో విడుదలై ఆకట్టుకుంది. అయితే రెగ్యూలర్‌ కమర్షియల్‌ సినిమా అనే మిశ్రమ స్పందన రాబట్టుకున్నా కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది. తాజాగా ఫస్ట్ డే కలెక్షన్లని ప్రకటించింది యూనిట్‌. 

ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో పది కోట్లకుపైగా ఓపెనింగ్స్ ని రాబట్టినట్టు వెల్లడించారు. సుమారు 11కోట్ల గ్రాస్‌, 7కోట్ల షేర్‌ని రాబట్టినట్టు తెలుస్తుంది. అయితే తొలి రోజు ఈ చిత్రానికి సాలిడ్‌ బుకింగ్స్ ఉన్నాయి. రవితేజ గత సినిమాలు నిరాశ పరిచినా బాక్సాఫీసు వద్ద `ధమాకా` మంచి ప్రదర్శన ఇవ్వడం చిత్ర యూనిట్‌లో జోష్‌ని నింపుతుంది. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి ప్రసన్న కుమార్‌ బెజవాడ కథ అందించారు. దానికి తగ్గట్టుగా త్రినాథ రావు నక్కిన తెరపై ఆవిష్కరించారు.

రవితేజలోని అసలు మాస్‌ని బయటపెట్టేలా, పాత రవితేజని పరిచయం చేసేలా ఈ సినిమాని తీర్చిదిద్దారు. దీంతో టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్లని రాబట్టుకుంటుంది. ఇటీవల కాలంలో రవితేజ సినిమాల్లో ఇది బెస్ట్ ఓపెనింగ్‌గా చెప్పొచ్చు. గతంలో సూపర్‌ హిట్‌ అయిన `క్రాక్‌` కూడా రూ.6.25కోట్లు వసూలు చేసింది. `ఖిలాడి` నాలుగున్నర కోట్లు, `రామారావు ఆన్‌ డ్యూటీ మూడు కోట్లు వసూలు చేయగా, `ధమాకా` వాటిని దాటుకుని దూసుకుపోతుంది. 

దాదాపు 19కోట్ల బిజినెస్‌తో థియేటర్‌కి వచ్చిన ఈ చిత్రం తొలి రోజే సగం కలెక్షన్లు రాబట్టింది. వీకెండ్‌తోనే బ్రేక్‌ ఈవెన్‌ దాటుకుని లాభాల్లోకి వెళ్తుందనే ఆశాభావం చిత్ర యూనిట్‌ నుంచి వినిపిస్తుంది. క్రిస్మస్‌ సెలవులు భోనస్‌. దీంతో ఈ సినిమా సూపర్‌ హిట్‌ జాబితాలోకి వెళ్లడం ఖాయమంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో రవితేజ రెండు పాత్రల్లో మెరిసిన విషయం తెలిసిందే. మాస్ మహారాజా అభిమానులకిది డబుల్‌ ధమాకాలాంటి చిత్రమయ్యింది. ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించారు.

Follow Us:
Download App:
  • android
  • ios