Asianet News TeluguAsianet News Telugu

దీపావళికి ‘ధమాకా’ నుంచి మాస్ క్రాకర్.. రౌడీలను ఉతికారేస్తున్న రవితేజ.. రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది.!

మాస్ మహారాజ అభిమానుల్లో దీపావళి జోష్ నింపేందుకు  ‘ధమాకా’ (Dhamaka) నుంచి ‘మాస్ క్రాకర్’ పేరిట టీజర్ విడుదల చేశారు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ తో రవితేజ దుమ్ములేపుతున్నాడు. మాస్ అండ్ క్లాస్ లుక్స్ లో అదరగొట్టాడు.
 

Dhamaka mass cracker out, Mass Maharaja Raviteja Superb Action!
Author
First Published Oct 21, 2022, 10:57 AM IST

మాస్ మహారాజా రవితేజ (Raviteja) తాజాగా నటిస్తున్న మాస్ యాక్షన్ ఫిల్మ్ ‘ధమాకా’. త్రినాధ రావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు.  ప్రస్తుతం షూటింగ్ తుది దశకు చేరుకుంది.  ఈ సందర్భంగా మేకర్స్ సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేలా ఎప్పటికప్పుడు అప్డేట్స్ ను అందిస్తున్నారు. ఇక దీపావళి సందర్భంగా ‘ధమాకా మాస్ క్రాకర్’ పేరిట అదిరిపోయే టీజర్ ను విడుదల చేశారు. తాజాగా వచ్చిన ఈ ‘మాస్ క్రాకర్’ యూట్యూబ్ లో ప్రస్తుతం దూసుకుపోతోంది.

ధమాకా మాస్ క్రాకర్.. అంటూ వచ్చిన వీడియోలు రవితేజ యాక్షన్ మార్క్ ను చూపించారు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సీక్వెల్స్ తో అదరగొట్టారు. దర్శకుడు ఈ చిత్రంతో వింటేజ్ రవితేజను చూపించే ప్రయత్నం చేసినట్టు కనిపిస్తోంది. డబుల్ డోస్ యాక్షన్, రవితేజ యాటిట్యూడ్, మాస్ అండ్ క్లాస్ లుక్స్ అదిరిపోయాయి. టీజర్ లో కామెడీ టైమింగ్ తో ఆకట్టుకుంటున్నారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది. నిర్మాణ విలువలను చాలా మెరుగ్గా కనిపిస్తున్నాయి. మొత్తానికి ‘దీపావళి’ కానుకగా Dhamaka Mass Cracker రావడంతో మాస్ మహారాజ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. 

అలాగే చిత్ర విడుదల తేదీని కూడా తాజాగా అనౌన్స్ చేశారు. ఇప్పటికే ఈ చిత్రం రిలీజ్ కావాల్సి ఉండేంది. కాస్తా ఆలస్యమైనా ప్రేక్షకుల ముందుకు సాలిడ్ యాక్షన్ తో రాబోతోంది. ఈ ఏడాది డిసెంబర్ 23న గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నట్టు టీజర్ ద్వారా ప్రకటించారు. మరో రెండు నెలల్లో రవితేజ ‘ధమాకా’ చూపించనున్నారు. దీపావళి సందర్భంగా సాలిడ్ యాక్షన్ ట్రీట్ తో పాటు రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేయడంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. 

‘ధమాకా’లో హీరోహీరోయిన్లుగా రవితేజ - శ్రీలీలా (Sree Leela) నటిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై నిర్మాతలు అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వ ప్రసాద్ సినిమాను  ఎక్కడా తగ్గకుండా నిర్మిస్తున్నారు. యాక్ష‌న్ఎంట‌ర్ టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న మూవీకి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.  జయరామ్, సచ్చిన్ ఖేడేకర్, తనికెళ్ల భరణి, రావు రమేశ్, అలీ, హైపర్ ఆది, పవిత్రా లోకేష్ తదితరులు ఆయా పాత్రల్లో నటిస్తున్నారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios