తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ

Dhadak actor Janhvi Kapoor visits Tirumala Tirupati temple
Highlights

దివంగత శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటించిన 'ధడక్' సినిమా మరో పది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా తన సినిమా సక్సెస్ కావాలని వేడుకోవడం కోసం జాన్వీ తిరుపతి వేంకటేశ్వరుని సన్నిధానానికి చేరుకుంది.

దివంగత శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటించిన 'ధడక్' సినిమా మరో పది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా తన సినిమా సక్సెస్ కావాలని వేడుకోవడం కోసం జాన్వీ తిరుపతి వేంకటేశ్వరుని సన్నిధానానికి చేరుకుంది. సాధారణంగా బాలీవుడ్ స్టార్స్ సినిమా విడుదలకు ముందు అజ్మీర్ దర్గా, గోల్డెన్ టెంపుల్ వంటి దేవాలయాలను దర్శించుకుంటారు.

అయితే జాన్వీ కపూర్ మాత్రం ఆదివారం తిరుపతిలో కనిపించింది. ఆమెతో పాటు తన తండ్రి బోణీ కపూర్, సోదరి ఖుషి కపూర్ లు కూడా దేవుడ్ని దర్శించుకున్నారు. సౌత్ ఇండియాకు వచ్చిన జాన్వీ, ఖుషిలు ఇక్కడి సంప్రదాయాలకు తగ్గట్లుగా రావడం కెమెరాలను ఆకర్షించింది. జాన్వీ సౌత్ లో దేవాలయాలకు రావడం ఇది తొలిసారి కాదు. గతంలో తన తల్లి శ్రీదేవి అస్థికలు కలపడానికి కుటుంబం మొత్తం తమిళనాడు రామేశ్వరం దగ్గరకు వెళ్లారు.

ప్రస్తుతం జాన్వీ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా గడుపుతోంది. సినిమా ట్రైలర్, జింగాట్ పాట విడుదలైన తరువాత అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఈ సినిమాలో ఆమె సరసన్ ఇషాన్ కట్టర్ కనిపించనున్నాడు.  

loader