ఈ మధ్యకాలంలో దేవిశ్రీప్రసాద్ హవా బాగా తగ్గిందనే చెప్పాలి. ఆయన నుండి ఆశించిన స్థాయిలో ఆల్బమ్స్ రావడం లేదు. స్టార్ హీరోల సినిమాలకు ఆయన అందిస్తోన్న బీట్స్ అభిమానులను ఆకట్టుకోలేకపోతున్నాయి. ఒక సినిమా ఆల్బంలో ఒకట్రెండు పాటలు క్లిక్ అయినా చాలని అభిమానులు సరిపెట్టుకుంటున్నారు.

మహేష్ బాబు నటించిన సినిమాలకు కూడా దేవి అంత గొప్ప సంగీతమేమీ అందించలేదు. శ్రీమంతుడు, భరత్ అనే నేను చిత్రాల్లో ఒకట్రెండు పాటలకు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాకు కలిసొచ్చాయి. అయితే 'మహర్షి' సినిమా విషయంలో మాత్రం అది జరిగేలా కనిపించడం లేదు.

ఇప్పటివరకు విడుదలైన మూడు పాటల్లో ఒక్కటి కూడా అభిమానులను మెప్పించలేకపోయింది. రీసెంట్ గా విడుదలైన మూడో పాట ఎవరెస్ట్ అంచున వీడియో కూడా రిలీజ్ చేశారు. సాంగ్ లో బీట్స్ బాగున్నప్పటికీ ట్యూన్ మాత్రం ఆర్డినరీగా ఉంది.  విజువల్స్ కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి.

మహేష్ బాబు డాన్స్ స్టెప్స్ ని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ అదిరిపోయే మ్యూజిక్ ఇస్తాడని ఆశిస్తోన్న ఫ్యాన్స్ కి నిరాశే ఎదురవుతోంది. మిగిలిన రెండు పాటలైనా బాగుంటాయో లేక అవి కూడా నామ్ కే వాస్ అన్నట్లు ఉంటాయో చూడాలి!