జాతీయ అవార్డ్ సాధించిన సందర్భంగా సంతోషంలో ఉబ్బితబ్బుబ్బయ్యారు దేవిశ్రీ. ఇండస్ట్రీ నుంచ ఆయనకు వరుసగా శుభాకాంక్షలు అందుతుండగా..దేవిశ్రీ మాత్రం తన గురువు ఆశీస్సులు తీసుకున్నారు.
జాతీయ అవార్డ్ సాధించిన సందర్భంగా సంతోషంలో ఉబ్బితబ్బుబ్బయ్యారు దేవిశ్రీ. ఇండస్ట్రీ నుంచ ఆయనకు వరుసగా శుభాకాంక్షలు అందుతుండగా..దేవిశ్రీ మాత్రం తన గురువు ఆశీస్సులు తీసుకున్నారు.
ఇక తాజాగా పుష్ప సినిమాకు ఉత్తమ సంగీత దర్శకుడిగా నేషనల్ అవార్డు గెలుచుకున్నాడు దేవిశ్రీప్రసాద్. జాతీయ అవార్డ్ సాధించడంతో.. సంబరాల్లో మునిగి తేలారు ఫ్యామిలీ. దేవిశ్రీ ప్యామిలీతో పాటు.. ఆయన అభిమానులు కూడా పండగ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో దేవిశ్రీ ప్రసాద్ తనకు సంగీత గురువైనా మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా ను ప్రత్యేకంగా కలుసుకున్నారు. ఆయన పాదాలకు నమస్కరించి.. ఆశీస్సులు తీసుకున్నాడు. ఈ విషయాన్ని దేవిశ్రీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
ఇళయరాజాను కలుసుకోవడం.. ఆయన ఆశ్సీస్సులు తీసుకోవడానికి సబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2021 సంవత్సరానికిగాను జాతీయ చలనచిత్ర అవార్డులను గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పురస్కారాల్లో ఆర్‌ఆర్‌ఆర్, పుష్ప సినిమాలు వరుస అవార్డ్ లను గెలుచుకున్నాయి. తెలుగు ఇండస్ట్రీకి 10 జాతీయ అవార్డ్ లు రాగా.. అందులో ఆర్‌ఆర్‌ఆర్ ఒక్క సినిమానే ఆరు అవార్డులు సాధించింది. ఇక పుష్ప సినిమా రెండు పురస్కారాలతో జాతీయ స్థాయిలో సత్తా చాటింది.
అంతే కాదు ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఉప్పెన ఎంపిక కాగా.. ఉత్తమ జనరంజక చిత్రంగా ఆర్‌ఆర్‌ఆర్ జాతీయ అవార్డును గెలుచుకుంది. అంతే కాదు ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, ఉత్తమ గీతరచయితగా చంద్రబోస్,ఉత్తమ క్రిటిక్ గా పురుషోత్తమ్ జాతీయ అవార్డ్ లను సాధించారు. ఇక జాతీయ స్థాయిలో ఉత్తమ నటి అవార్డును అలియాభట్ గంగూబాయి కతియావాడి సినిమాకు గాను సాధించారు. ఆమెతో పాటు కృతిసనన్ సంయుక్తంగా ఈ అవార్డ్ ను గెలుచుకున్నారు. రాకెట్రీ-ది నంబి ఎఫెక్ట్ జాతీయ ఉత్తమ చిత్రంగా పురస్కారాన్ని గెలుచుకుంది.
ఇక భారతీయ సినీ చరిత్రలోనే తన సంగీతంతో ఎంతోమంది కుర్రకారును ఒక ఊపు ఊపిన సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్. అయన మ్యూజిక్ అంటే ప్రతి ఒక్కరికి ఎంతో ఇష్టం. నీకోసం, ఆనందం, ఖడ్గం, బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, మన్మథుడు, ఆర్య , పుష్ప, వాల్తేరు వీరయ్య లాంటి ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలకు తన మ్యూజిక్ అందించారు.
