ప్రతీ ఆరు నెలలకు ఒకసారి ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ వివాహం వార్తలు వస్తూనే ఉంటూంటాయి. ఆయన వివాహం చేసుకునేదాకా మీడియా వదిలిపెట్టదు. ఇదిగో ఇప్పుడు మరోసారి వెబ్ మీడియా,యూట్యూబ్ లో ఆయన వివాహం గురించిన వార్తలు మొదలయ్యాయి.

ప్రతీ ఆరు నెలలకు ఒకసారి ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ వివాహం వార్తలు వస్తూనే ఉంటూంటాయి. ఆయన వివాహం చేసుకునేదాకా మీడియా వదిలిపెట్టదు. ఇదిగో ఇప్పుడు మరోసారి వెబ్ మీడియా,యూట్యూబ్ లో ఆయన వివాహం గురించిన వార్తలు మొదలయ్యాయి. నిజంగా దేవి మనస్సులో ఏముందో కానీ మీడియా వాళ్లు మాత్రం త్వరలో పెళ్లి అన్నట్లు హంగామా చేసేస్తున్నారు.

అప్పట్లో ఛార్మితో ఇదిగో ఇంకెంత ఓ రెండు రోజుల్లో పెళ్లి అన్నట్లుగా హడావిడి జరిగింది. దానికి తగ్గట్లే వీళ్లిద్దరు కలిసి కనపడుతూండేవారు. అయితే ఆ తర్వాత ఛార్మి పెళ్లి చేసుకోలేదు...దేవి అలాగే బ్యాచులర్ బోయ్ గా ఉండిపోయాడు. ఇప్పుడు మళ్ళీ ఇన్నాళ్లకు దేవి, ఛార్మి పెళ్లంటూ ..యూట్యూబ్ లో వార్తలు మొదలయ్యాయి. 

ఇదిలా ఉంటే దేవి..పూజితను పెళ్లి చేసుకోబోతున్నాడని మరికొన్ని వార్తలు. ఎవరా పూజిత అంటే... రంగ‌స్థలంలో ప్రకాష్ రాజ్ కూతురిగా న‌టించిన ఆమె. ఆ పూజిత‌తో ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు దేవిశ్రీ ప్ర‌సాద్ వివాహం చేసుకోబోతున్నాడ‌ని మరో ప్రక్క ప్ర‌చారం సాగుతోంది. ఈ అమ్మాయితో దేవిశ్రీ‌కి ఎలా కుదిరింది? గుసగుసలు వినిపించాయి. ఈ విషయమై ఇటు దేవీ శ్రీ‌గానీ, అటు పూజిత‌గానీ స్పందించ‌లేదు. అలాగ‌ని ఎవ‌రూ దీన్ని ఖండించ‌లేదు. ఏదైమైనా దేవి పెళ్ళి చేసుకునేంతవరకూ ఇలాంటి ప్ర‌చారాలు సాగుతుందంటున్నారు దేవీ అభిమానులు.

కెరీర్ విషయానికి వస్తే..

తెలుగులో నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు దేవిశ్రీ ప్రసాద్. అయితే ఈ మధ్యన ఆయన ఆల్బమ్స్ ఏమీ పెద్దగా హిట్ కాలేదు. లాస్ట్ ఇయిర్ ‘ఎంసీఏ’.. ఈ ఏడాది ‘హలో గురూ ప్రేమ కోసమే’ వర్కవుట్ కాలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అంతంత మాత్రమే అన్నట్లుంది. ఈ మధ్యలో ‘రంగస్థలం’.. ‘భరత్ అనే నేను’ సినిమాల్లో దేవి సంగీతం దుమ్ము రేపాయి. 

దాంతో ఇప్పుడు దేవి నుంచి రాబోతున్న పెద్ద సినిమా ‘వినయ విధేయ రామ’ విషయంలో మెగా అభిమానులకు రకరకాల అనుమానాలు మొదలవుతున్నాయి.ముఖ్యంగా టీజర్లో దేవి తన పాత సినిమాల బ్యాగ్రౌండ్ స్కోర్ రిపీట్ చేయడంతో విమర్శల పాలయ్యాడు. అయితే పాటలు రిలీజ్ అయ్యాక అసలు విషయం తేలుతుంది. అప్పటిదాకా వెయిట్ అండ్ సీ.