టాలీవుడ్ ని తన సంగీత ప్రభంజనంలో ఊపేస్తున్న మ్యూజిక్ డైరక్టర్ దేవి శ్రీ ప్రసాద్. ఆయన కేవలం తెర వెనక సంగీత దర్శకుడుగానే కాక,   ఆయన అప్పుడప్పుడూ  తెరపై కనిపించి అలరిస్తూంటారు. అలాగే స్టేజిలపై .., తన పాటలతో యూత్ ని లైవ్ లో ఉర్రూతలూగిస్తూంటారు.  ఈ నేపధ్యంలో ఆయనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్స్ బేస్ ఉంది. ఇప్పుడు ఆయన దానిని రెట్టింపు చేయటానికా అన్నట్లుగా హీరోగా పలకరించటానికి సిద్దపడుతున్నారు. 

ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం మేరకు ఇప్పటికే ప్రముఖ దర్శకుడు సుకుమార్ ..దేవి బాడీ లాంగ్వేజ్ కు తగ్గ కథ రెడీ చేసారని వినికిడి. అయితే ఆయన డైరక్ట్ చేయటం లేదంటున్నారు. సుకుమార్ అసెస్టెంట్స్ లో ఒకరు ఈ సినిమాని డైరక్ట్ చేయబోతున్నారు. అయితే దిల్ రాజుతో కలిసి ఆయన కో ప్రొడ్యూస్ చేయనున్నారు. 

యూత్ ఫుల్ మ్యూజిక్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం సాగుతుందని, పాటలకు ఎక్కువ ప్రయారిటీ ఉంటుందని చెప్తున్నారు. అలాగే ఇందుకోసం దేవి ప్రత్యేకంగా నటనలో ఈజ్ కోసం ట్రైనింగ్ తీసుకుంటున్నారంటున్నారు. ఇక ఈ విషయమై అఫీషియల్ గా ప్రకటన రావాల్సి ఉంది. అప్పటిదాకా మిగతా వివరాలు కోసం వేచి ఉండాల్సిందే.