రచయితగా ఎన్నో సినిమాలకు పని చేసిన సత్యమూర్తి వారసత్వాన్ని ఇప్పుడు ఆయన చిన్న కుమారుడు కొనసాగిస్తున్నాడు. పెద్ద కుమారుడు దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు ఇండస్ట్రీలో మంచి ఫామ్ లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. చిన్న కుమారుడు సాగర్ సింగర్ గా కూడా పలు పాటలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 

ఇక నెక్స్ట్ సాగర్ మాటల రచయితగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. బెల్లంకొండ నటిస్తోన్న రాక్షసుడు సినిమాకు డైలాగ్ రైటర్ గా సాగర్ వర్క్ చేస్తున్నాడు. ఈ సినిమా తమిళ్ రాట్ససన్ కు రీమేక్ వస్తోన్న సంగతి తెలిసిందే. తన సోదరుడు రైటర్ గా వర్క్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని టీవీ సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. 

అదే విధంగా తండ్రి వారసత్వాన్ని అతను కొనసాగించేలా మీ ఆశీర్వాదం ఉండాలని దేవి శ్రీ అభిమానులను కోరాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న రాక్షసుడు సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.