Asianet News TeluguAsianet News Telugu

'దేవర' పై కొరటాల థీమా ఏ స్దాయిలో అనేది ఈ ఒక్క విషయం చెప్తోంది

 దేవర సినిమాలో ఒక కొత్త ప్రపంచం, చాలా బలమైన పాత్రలు, అత్యంత భారీతనం ఉంటుందని అన్నారు. 

Devara will have late night shows in the Telugu states starting from 1 AM jsp
Author
First Published Aug 27, 2024, 3:33 PM IST | Last Updated Aug 27, 2024, 3:33 PM IST


కల్కి తర్వాత ఇప్పుడు అందరి దృష్టీ దేవరపైనే ఉన్న సంగతి తెలిసిందే.   'దేవర' మూవీ సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుండటంతో బిజినెస్ కూడా క్లోజ్ అయ్యిపోయింది. ఇప్పటికే విడుదలైన పాటలు, ప్రమోషన్ మెటీరియల్ జనాల్లోకి బాగా వెళ్లటంతో  భారీగా బజ్ క్రియేట్ అవుతోంది. కోపంతో చూస్తూ ఉన్న ఎన్టీఆర్ లుక్ బిజినెస్ కు కారణమవుతోంది. యాక్షన్ మామూలుగా ఉండదని , అరాచకం అని కొరటాల ఎలాగైనా ఇండస్ట్రీ మారుమ్రోగే స్దాయిలో హిట్ కొట్టాలని అన్ని జాగ్రత్తలు తీసుకుని చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాపై కొరటాల కాన్ఫిడెన్స్ మామూలుగా లేదు.  అందుకు కారణం లేట్ నైట్ ప్యాన్స్ షో లకు  ఆయన ఒప్పుకోవటమే అంటున్నారు.

మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు , దేవర తెలుగు రాష్ట్రాల్లో అర్థరాత్రి షోలను రాత్రి 1 గంటల నుండి ప్రారంభించనున్నారు.  అయితే సాధారణంగా ఎర్లీ మార్నింగ్ షోలకు కొరటాల వ్యతిరేకం. ఇంతకుముందు, జనతా గ్యారేజ్ విడుదలైన తర్వాత, ఉదయాన్నే 4 AM షోల నుండి వచ్చిన మిక్స్డ్ టాక్ గురించి కొరటాల స్వయంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. “ ఎన్టీఆర్ మాస్ అప్పీల్ పెద్దది. అలాగే 4 AM షోలను అభిమానులు మాత్రమే చూస్తారు.  సినిమా ఎలా ఉండాలనే దాని గురించి వారి స్వంత మీటర్, అంచనాలు కలిగి ఉంటారు .వారి మీటర్ తో సినిమా  సరిపోలనప్పుడు, వారు డివైడ్ టాక్ ఇస్తారు. కానీ వారు నిజమైన ప్రేక్షకులు కాదు. నిజమైన ప్రేక్షకులు ఉదయం 8:45 నుండి మొదలవుతారు” అన్నారు. 

జనతా గ్యారేజ్ విషయంలో వచ్చిన మిక్స్‌డ్ టాక్‌ని బేరీజు వేసుకున్న కొరటాల మళ్లీ దేవర కోసం ఎర్లీ షోలకు ఓకే చెప్పటం చర్చనీయాంశంగా మారింది. భారతదేశంలో 1 AM షోలు అంటే USA ప్రీమియర్‌ షో టైమింగ్స్  లతో సమానంగా ఉంటాయి, ఇది మరొక ఇంట్రస్టింగ్ విషయం.అదే సమయంలో, 1 AM షోలు సినిమాకు మంచి  హైప్ ఇస్తాయి, ఎందుకంటే చాలా మంది ఫ్యాన్స్ తో కలిసి ఎంజాయ్ చేస్తూ సినిమా చూడాలనుకుంటారు. టాక్ వచ్చిన తర్వాత సినిమా చూడటం కంటే ఇలా చూడటం వారికి ఆనందాన్ని కలిగిస్తుంది.   అలాగే తెల్లారే సరికి టాక్‌ను వ్యాప్తి చేస్తుంది. అది హిట్ కావచ్చు ప్లాఫ్ కావచ్చు. ఓ రకంగా ఇది దేవర తీసుకుంటున్న  రిస్క్. అయితే టీమ్, ఎన్టీఆర్ , డైరక్టర్ శివ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు అనడానికి ఇది కూడా సైన్ కూడా కావచ్చు. 

ఇక దేవర సినిమాలో ఒక కొత్త ప్రపంచం, చాలా బలమైన పాత్రలు, అత్యంత భారీతనం ఉంటుందని అన్నారు. అందుకే ఒకే భాగంలో దేవర కథను పూర్తిగా చూపించడం కష్టమని అనిపిస్తోందని కొరటాల చెప్పారు. అందుకే రెండు పార్ట్‌ల్లో దేవర సినిమాను తీసుకురావాలని నిర్ణయించినట్టు వివరించారు. రూ.300 కోట్లతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.    ఈ సినిమాకు లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ సంగీతం అందిస్తున్నారు.  
 
‘జనతా గ్యారేజ్’ తర్వాత కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్‌ కాంబోలో వస్తున్న చిత్రం    'దేవర' .  ‘దేవర’లో ఎన్టీఆర్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు సమాచారం.   దేవర సినిమాలో ఒక కొత్త ప్రపంచం, చాలా బలమైన పాత్రలు, అత్యంత భారీతనం ఉంటుందని అన్నారు. అందుకే ఒకే భాగంలో దేవర కథను పూర్తిగా చూపించడం కష్టమని అనిపిస్తోందని కొరటాల చెప్పారు. అందుకే రెండు పార్ట్‌ల్లో దేవర సినిమాను తీసుకురావాలని నిర్ణయించినట్టు వివరించారు. 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios