సారాంశం

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌ హీరోగా నటించిన దేవర చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ విజయం సాధించింది. ఎన్టీఆర్ ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌ హీరోగా నటించిన దేవర చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ విజయం సాధించింది. ఎన్టీఆర్ ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. విశేషంగా చర్చకు దారి తీసిన దేవర క్లైమాక్స్ సీన్, సీక్వెల్ పై ఆసక్తిని మరింత పెంచింది.

ఇప్పుడు దేవర రెండో భాగం కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు శుభవార్త. నమ్మదగిన వర్గాల సమాచారం ప్రకారం, మేకర్స్ మే 20న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా దేవర సీక్వెల్ గురించి అధికారిక ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది. అదే రోజు ఈ సినిమాకు సంబంధించిన ఓ చిన్న గ్లింప్స్‌ కూడా విడుదల చేయనున్నారని వార్తలు వస్తున్నాయి.

దేవర సీక్వెల్ ప్రీ-ప్రొడక్షన్ కార్యక్రమాలు జూలై నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. మొదటి భాగంలో కథ, విజువల్స్, సంగీతం ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. రెండో భాగంపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

తొలి భాగంలో కథానాయికగా నటించిన జాన్వీ కపూర్‌ రెండో భాగంలోనూ కొనసాగే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అయితే ఇది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర సీక్వెల్ పై ప్రస్తుతం చిత్రబృందం ఏర్పాట్లలో ఉంది. మే 20న రాబోయే అప్డేట్ పై అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. దేవర చిత్రం విజయం సాధించినప్పటికీ కథ విషయంలో విమర్శలు వచ్చాయి. కానీ దేవర 2లో అలాంటి పొరపాటు లేకుండా కథ పకడ్బందీగా ఉంటుందని అంటున్నారు. ఎన్టీఆర్ నటన నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని అంచనా వేస్తున్నారు. పూర్తి వివరాలు అధికారిక ప్రకటనలో తెలియనున్నాయి.