Asianet News TeluguAsianet News Telugu

'మగధీర' విలన్ దేవ్ గిల్ లో ఈ యాంగిల్ కూడా ఉందా?

 'పూల రంగడు', 'రచ్చ', 'నాయక్', 'వకీల్ సాబ్' ఇలా వరసపెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్లారు. అలాగే  హిందీలో సల్మాన్ ఖాన్ 'దబాంగ్ 3',..

Dev Gill Pan India film Aho Vikramarka releasing in theatres jsp
Author
First Published Jul 23, 2024, 8:09 AM IST | Last Updated Jul 23, 2024, 8:09 AM IST

హీరోలు అప్పుడప్పుడూ తమలోని టాలెంట్ ని చూపించుకోవటానికి నెగిటివ్ పాత్రలు చేస్తూంటారు. అలాగే కమిడియన్స్ సైతం అవకాసం వచ్చినప్పుడు హీరోగా టర్న్ తీసుకుంటారు. అదే విధంగా ఇప్పుడు ఎన్నో సినిమాల్లో విలన్ గా చేసి మెప్పించిన దేవ్ గిల్ ..హీరోగా సినిమా చేసారు. ఆ సినిమా కూడా ఏదో ఆశామాషీ కాకుండా ప్యాన్ ఇండియా రిలీజ్ కి రెడీ చేసారు.  వివరాల్లోకి వెళితే...

'మగధీర' చిత్రంలో దేవగిల్ చేసిన  విలనిజం ఎంతో మందికి నచ్చింది. ఆ తర్వాత 'రగడ', 'ప్రేమ కావాలి', 'పూల రంగడు', 'రచ్చ', 'నాయక్', 'వకీల్ సాబ్' ఇలా వరసపెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్లారు. అలాగే  హిందీలో సల్మాన్ ఖాన్ 'దబాంగ్ 3', తమిళంలో రజనీకాంత్ 'లింగా'తో పాటు పలు హిట్ సినిమాలు చేశారు. ఇప్పుడు ఆయన హీరోగా   పాన్ ఇండియా సినిమా 'అహో! విక్రమార్క' (Aho Vikramarka) తెరకెక్కింది. ఆ సినిమా విడుదల తేదీని  అనౌన్స్ చేశారు. 
 
దేవ్ గిల్ క హీరోగా నటించిన పాన్ ఇండియా ఫిల్మ్ 'అహో! విక్రమార్క'. ఇందులో ఆయన పోలీస్ ఆఫీసర్ రోల్ చేశారు.  ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 30న తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ భాషల్లో 'అహో విక్రమార్క'ను భారీ ఎత్తున సినిమా విడుదల చేయనున్నట్టు ఇవాళ వెల్లడించారు. ఈ చిత్రానికి పేట త్రికోటి దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సినిమాను దేవ్ గిల్ ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కించారు. ఆర్తి దేవిందర్ గిల్, మీహిర్ కుల్జర్ని, అశ్విని కుమార్ మిస్రా నిర్మాతలు. 

 హీరో దేవ్ గిల్ మాట్లాడుతూ... ''ప్రతి క్షణం ప్రజల సంక్షేమం కోసం ఆలోచించే పోలీసులు ఎంత ధైర్యంగా తమ విధులు నిర్వర్తిస్తారు? ఎంత అకింత భావంతో ఉద్యోగం చేస్తారు? అనేది మా సినిమాలో చాలా గొప్పగా చూపించబోతున్నాం. సినిమా ఫస్ట్ కాపీ చూశా. చాలా బాగా వచ్చింది. ఆగస్టు 30న పాన్ ఇండియా లెవ‌ల్లో భారీ ఎత్తున విడుద‌ల చేస్తున్నాం. ప్రేక్షకులు ఇప్ప‌టి వ‌ర‌కు నాలోని న‌టుడిని ఓ కోణంలో మాత్రమే చూశారు. ఈ సినిమాతో మరో కోణాన్ని చూస్తారు'' అని చెప్పారు. 

డైరక్టర్ పేట త్రికోటి మాట్లాడుతూ... ''పోలీసుల పవర్‌ తెలియ‌జేసేలా ఈ సినిమా తెరకెక్కించా. మేం ముందుగా అనుకున్న ప్రణాళిక ప్రకారం రూపొందించాం. ఫ‌స్ట్ లుక్‌, టీజ‌ర్‌ ఆల్రెడీ విడుదల చేశాం. ఇందులో దేవ్ గిల్ ను ప్రేక్షకులు స‌రికొత్త‌గా చూస్తారు. ఆగస్టు 30న మా సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది'' అని అన్నారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios