శరీర బరువు పెరిగి బొద్దుగా ఉన్న అనుష్క కాస్త ఇప్పుడు ఎంతో నాజుకూగా తయారైంది. సమయం తీసుకున్నప్పటికీ ఫైనల్ గా అమ్మడు అనుకున్నది సాధించింది. నిన్న ఆమె లుక్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.

అనుష్క ఈజ్ బ్యాక్ అంటూ అభిమానులు మురిసిపోతున్నారు. అయితే ఈ ఫోటోల్లో అనుష్కతో పాటు మరో విదేశీయుడు కనిపించాడు. ఇద్దరూ కలిసి బీచ్ లో ఫోటోలు దిగడంతో వెంటనే పుకార్లు మొదలయ్యాయి. అయితే అతడి గురించి సినిమా ఇండస్ట్రీలో చాలా మందికి తెలుసట.

ఆ వ్యక్తి ఎవరిని ఆరా తీయగా.. అతడి పేరు ల్యూక్ కోటిన్ హో అని తెలిసింది. అతడొక న్యూట్రీషనిస్ట్. నేషనల్ వైడ్, ఇంటర్నేషనల్ వైడ్ అతడికి చాలా మంది క్లైంట్స్ ఉన్నారు. వారిలో అనుష్క కూడా ఒకరు. ఫిట్ నెస్ విషయంలో ఆమెకి ట్రైనింగ్ ఇస్తూ.. ఆమె సన్నగా మారడంలో కీలకపాత్ర పోషించాడు ల్యూక్.

అనుష్క కోసం స్పెషల్ గా డైట్ తయారు చేశారట. ఇష్టమైన ఆహారాన్ని తింటూనే సన్నగా మారే విధంగా డైట్ తయారు చేశాడు ల్యూక్. ఆ కారణంగానే అతడితో ఫోటోలు దిగినట్లు తెలుస్తోంది. 

అనుష్క స్లిమ్ లుక్.. చూస్తే షాకే!