అలీ సమర్పణలో ఖ‌యూమ్‌, తనిష్క్ , రాజ‌న్‌, షానీ, పృథ్విరాజ్‌, స‌మీర్‌, లోహిత్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన సినిమా 'దేశంలో దొంగ‌లు ప‌డ్డారు'. గౌత‌మ్ రాజ్‌కుమార్ ద‌ర్శ‌కుడు. ర‌మా గౌత‌మ్ నిర్మాత‌.  అక్టోబర్ 4న ఈ చిత్రం విడుదలవుతుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో.. 

అలీ మాట్లాడుతూ..  "దేశంలొ దొంగలు పడ్డారు సినిమా చూశాను. నచ్చింది. దర్శకుడు గౌతమ్ వద్ద టాలెంట్ ఉంది. ఖయ్యూమ్ తో చాలా వైవిధ్యమైన సినిమా చేశాడు. టెక్నికల్ గా దిబెస్ట్ మూవీ ని ఈ టీమ్ తీసుకువచ్చారు. చిరంజీవి గారు ట్రైలర్ లాంఛ్ చేయటం మా సినిమాకు చాలా కలిసి వచ్చింది'' అని అన్నారు. 

ఖ‌య్యుమ్ మాట్లాడుతూ.‌.. ''నేను చాలా సినిమాలు చేశాను. రిలీజ్ కు ముందు నుంచే దేశంలో దొంగలు పడ్డారు  చిత్రానికి పాజిటివ్ బజ్ వచ్చింది. చిరంజీవి గారి
వల్ల సినిమాకు హైప్ వచ్చిందని'' అన్నారు. 

ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ.. ''అలీ గారి వల్లే ఈ సినిమా అక్టోబర్ 4న  రిలీజ్ వరకు వచ్చింది. హ్యూమన్ ట్రాఫికింగ్ నేపథ్యంలో సినిమా రియలిస్టిక్ గా చేశామని'' అన్నారు.