Asianet News TeluguAsianet News Telugu

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు, బాలీవుడ్ బ్యూటీని వెంటాడుతున్న వరుస కేసులు

బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ను వరుసగా కేసులు వెంటాడుతూనే ఉన్నాయి. హాయిగా సినిమాలు చేసుకుంటున్న ఆమెకు ఈ కేసుల భయం వల్ల నిద్ర లేకుండా అవుతోంది.. తాజాగా ఆమె మరో నోటీసు అందుకున్నట్టు తెలస్తోంది. 
 

Delhi High court summons Bollywood Star  Jacqueline fernandez
Author
First Published Sep 1, 2022, 6:33 AM IST

బాలీవుడ్ స్టార్ యాక్ట్రస్  జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను కేసుల భయాలు ఇంకా  వెంటాడుతూనే ఉన్నాయి.  ముఖ్యంగా ఈ మధ్య ఆమె పై  వచ్చిన మ‌నీ ల్యాండ‌రింగ్‌ ఆరోపణలు ఇంకా బలపడుతున్నాయి. ఆమె మనీ లాండరింగ్ కు పాల్ప‌డ్డార‌న్న ఆరోప‌ణ‌ల‌పై జాక్వెలిన్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ ఇప్ప‌టికే కేసులు న‌మోదు చేసి ధర్యప్తు కూడా జరుపుతున్నారు. ఈ విషయంలో ఆమెను పలుమార్లు ప్రశ్నించారు కూడా.  ఇక  ఈ కేసు విచార‌ణ‌లో భాగంగా ఢిల్లీ హైకోర్టు నుంచి జాక్వెలిన్‌కు బుధ‌వారం నోటీసులు జారీ చేసింది. 

మ‌నీ ల్యాండ‌రింగ్ కేసు విచార‌ణ‌లో భాగంగా ఈ నెల 26న త‌మ ముందు హాజ‌రు కావాలంటూ ఢిల్లీ హైకోర్టు జాక్వెలిన్‌కు నోటీసులు జారీ చేసింది. సుఖేశ్ చంద్రశేఖర్‌పై న‌మోదైన 200 కోట్ల‌ మ‌నీ ల్యాండ‌రింగ్ కేసులో జాక్వెలిన్ పేరును చేరుస్తూ ఈడీ గ‌తంలోనే కేసు న‌మోదు చేసింది.  సుకేష్ లబ్ధి పోందిన డబ్బు నుంచి ఆమెకు కూడా వాటా వెళ్లిన్నట్టు అనుమానాలు ఉన్నాయి. దాంతో రకరకాల కోణాల్లో ఈ విచారణ కొనసాగుతోంది. 

 

 

సుకేష్ అన్యయపు సంపాదన  నుంచిజాక్వెలిన్ కూడా లబ్ధి పొందినట్లు దర్యాప్తులో గుర్తించామని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వెల్లడించింది. సుకేష్ చంద్రశేఖర్‌ దోపిడీదారు అని జాక్వెలిన్‌కు ముందే తెలుసని, అయినప్పటికీ అతడితో క్లోజ్ గా మూవ్ అవుతూ రిలేషన్ మెయింటేన్ చేసినట్టు వారు  పేర్కొన్నాయి అంతే కాదు  ఎప్పుడూ..వీడియో కాల్స్‌లో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సుకేష్‌తో నిరంతరం టచ్‌లో ఉన్నట్లు విచారణలో తెలిసింది. 

ఈ క్రమంలో మరింత విచారణ చేసిన అధికారులకు విస్తుపోయే మరికొన్ని నిజాలు కూడా తెలిసినట్టు సమాచారం. జాక్వెలిన్‌కు కాస్ట్లీ బహుమతులు ఇచ్చినట్లు సుకేష్ కూడా అంగీకరించాడంట. గతంలో సుకేష్ ఆమెకు 10 కోట్ల విలువైన బహుమతులు పంపినట్లు ఈడీ గుర్తించింది.దీనిపై లోతైన విచారణ జరుగుతోంది. ఇక ఈ వ్యవహారం నుంచి బాలీవుడ్ నటి ఇప్పుడప్పుడు బయట పడే సూచనలు కనిపించడం లేదు. 

Follow Us:
Download App:
  • android
  • ios