తన నటన, గ్లామర్‌తో ఏ పాత్ర అయిన చేయగలనని ప్రూవ్ చేసుకుంది బాలీవుడ్‌ హాట్ బ్యూటీ దీపికా పదుకొనే. ప్రస్తుతం సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్న దీపిక శకున్‌ బాత్ర దర్శకత్వంలో ఓ సినిమాను ఎనౌన్స్‌ చేసింది. అయితే ఈ సినిమా కోసం సిద్ధమవుతోంది దీపిక. త్వరలో షూటింగ్‌కు హాజరయ్యేందుకు ప్లాన్ చేస్తున్న దీపిక అందుకోసం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో దీపిక యోగా క్లాసెస్‌ తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.

దీపిక సన్నిహితులు అందించిన సమాచారం మేరకు శకున్ బాత్రా సినిమా షూటింగ్‌కు ముందు యోగా ట్రైనింగ్‌ తీసుకోవాలని నిర్ణయించుకుంది. సినిమా ప్రిపరేషన్‌లో భాగంగానే ఈ క్లాసెస్‌ తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అయితే సినిమాలో తన పాత్ర కోసం ఈ ట్రైనింగ్ తీసుకుంటుందా..? ఆరోగ్యం కోసం తీసుకుంటుందా అన్న విషయం మాత్రం వెల్లడించలేదు. ఇప్పటికే యోగా ట్రైనింగ్‌ క్లాసులు కూడా ప్రారంభించినట్టుగా తెలుస్తోంది.

ఇటీవల ఓ డిజిటల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను రోజూ సినిమా స్క్రిప్ట్‌ ను చదువుతున్నా అని తెలిపింది. పాత్రలో కనెక్షన్‌ పోకూదన్న ఉద్దేశంతోనే అలా చేస్తున్నానని చెప్పింది. వెండితెర మీద గ్లామర్ రోల్స్‌తో పాటు ఎన్నో అద్భుతమైన పాత్రలో ఆకట్టుకుంది. లాక్‌ డౌన్‌ విధించి ఉండకపోతే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శ్రీలంకలో జరుగుతూ ఉండేది.  అయితే తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం షూటింగ్‌లకు అనుమతి ఇవ్వటంతో త్వరలోనే సినిమాను తిరిగి ప్రారంభించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.