Asianet News Telugu

ప్రభాస్ 21: దీపిక పాత్ర ఇంట్రస్టింగ్‌గా ఉందే!

దీపికాను హీరోయిన్ గా ప్రకటించడం పై ప్రభాస్ ఇంట్రస్టింగ్ గా స్పందించారు. దీపికాతో వర్క్ చేయడానికి ఎంతో ఎక్సైట్ అవుతున్నాను. దీపికా నీకు వెల్కమ్ అని ప్రభాస్ తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఈ చిత్రం కోసం దీపికా భారీమొత్తంలో అందుకున్నారని వార్తలు మరో ప్రక్కన వస్తున్నాయి. ఆమె రాకతో ఈ ప్రాజెక్ట్ కి మరింత క్రేజ్ వచ్చి చేరింది. ఈ నేపధ్యంలో అసలు ఈ సినిమాలో దీపిక పోషించే క్యారక్టర్ ఏమిటనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. 

Deepika Padukone role revealed in Prabhas movie
Author
Hyderabad, First Published Jul 22, 2020, 9:46 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ప్రభాస్ 21 మూవీలో హీరోయిన్ గా దీపికా పదుకొనె ఖరారు అయ్యిన సంగతి తెలిసిందే. చాలా రోజులుగా ప్రభాస్ 21లో హీరోయిన్ దీపక అంటూ వార్తలు ప్రచారంలో ఉన్నా.... అధికారిక ప్రకటన రావడంతో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఇక దీపికాను హీరోయిన్ గా ప్రకటించడం పై ప్రభాస్ ఇంట్రస్టింగ్ గా స్పందించారు. దీపికాతో వర్క్ చేయడానికి ఎంతో ఎక్సైట్ అవుతున్నాను. దీపికా నీకు వెల్కమ్ అని ప్రభాస్ తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఈ చిత్రం కోసం దీపికా భారీమొత్తంలో అందుకున్నారని వార్తలు మరో ప్రక్కన వస్తున్నాయి. ఆమె రాకతో ఈ ప్రాజెక్ట్ కి మరింత క్రేజ్ వచ్చి చేరింది. ఈ నేపధ్యంలో అసలు ఈ సినిమాలో దీపిక పోషించే క్యారక్టర్ ఏమిటనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. 

అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాలో దీపిక పోషించే పాత్ర ..డాన్సర్. ఈ పాత్ర వచ్చేకే కథ మలుపు తిరుగుతుంది. ఆమె పాత్రలో చాలా ట్విస్ట్ లు ఉండబోతున్నాయి. టైమ్ ట్రావిలింగ్ కు సైతం ఆమె పాత్రే ఇనీషియేట్ చేస్తుందంటున్నారు. ప్రభాస్ పాత్ర ఈమెతో ప్రేమలో పడటమే కాకుండా కథలో అనేక మలుపులుకు కారణం అయ్యేలాగ ఆ పాత్రను డీల్ చేసారట. ఈ పాత్ర గత కాలంలో నివసించిన ఓ  ప్రముఖ  డాన్సర్ ని పోలి ఉంటుందంటున్నారు. దర్శకుడు నాగ్ అశ్విన్ ఓ యూనివర్సల్ సబ్జెక్టు తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించనున్నారు.  

 'మ‌హాన‌టి' ఫేం  నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందనున్న  ప్ర‌భాస్ 21వ సినిమా లేటెస్ట్ అప్‌డేట్ అభిమానుల‌ను ఎగిరి గంతేసేలా చేస్తున్న సంగతి తెలిసిందే.  బాలీవుడ్  స్టార్ హీరోయిన్ దీపికా ప‌దుకొనె ఈ సినిమాలో ప్ర‌భాస్‌తో క‌లిసి న‌టించ‌నుంది. దీపిక‌కు తెలుగులో ఇదే తొలి సినిమా కావ‌డం విశేషం.  ప్ర‌భాస్ సినిమాలో న‌టించేందుకు దీపిక‌ను ఒప్పించ‌డం కోసం నాగ్ అశ్విన్ టీమ్ బాగానే ఖ‌ర్చు పెట్టిన‌ట్లు తెలుస్తోంది. అలాగే ఈ సినిమా నిమిత్తం దీపికకు బాగానే ముట్టచెప్తున్నారని వినపడుతోంది. అయితే ఆ మొత్తం ఎంత అనేది ...బాలీవుడ్ వర్గాల ద్వారా బయిటకు వచ్చింది.

ఈ భారీ బడ్జెట్‌ చిత్రంలో కీలకపాత్రలు పోషించే నటీనటులను జాగ్రత్తగా ఎంపిక చేస్తోంది చిత్రబృందం. సైన్స్‌ ఫిక్షన్‌ కథాంశంతో సాగే ఈ సినిమాలో విలనిజాన్ని చాలా కొత్తగా చూపించాలని దర్శకుడు భావిస్తున్నారట. ప్రభాస్‌తో పోటీగా సాగే విలన్‌ పాత్ర కోసం ఒక​ప్పటి హీరో.. రీఎంట్రీ విలన్‌ అరవింద్‌ స్వామి అయితే బాగుంటుందని నాగ్‌ అశ్విన్‌ అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఆయనతో దర్శకుడు సంప్రదింపులు జరిపినట్లు ఫిలింనగర్‌ వర్గాల టాక్‌. ఇక ఈ సినిమా అనీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది చివర్లో లేక వచ్చే ఏడాది ఆరంభంలో పట్టాలెక్కే అవకాశం ఉంది. వైజయంతి మూవీస్‌ పతాకంపై అశ్వినీదత్‌ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios